ETV Bharat / business

కొత్త కార్లపై బంపర్ ఆఫర్స్.. రూ.70వేలు డిస్కౌంట్.. జూన్​లో కొంటేనే..

author img

By

Published : Jun 5, 2023, 5:22 PM IST

Best discounts on cars June 2023: సొంత కారు కొనాలనేది చాలా మందికి ఒక కల. అలాంటి అద్భుతమైన కలను సాకారం చేసుకునే సమయం వచ్చేసింది. మారుతి, రెనాల్ట్స్​ లాంటి ప్రతిష్టాత్మకమైన కంపెనీలు తమ సరికొత్త సెలెక్టెడ్​ మోడల్​​​ కార్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించాయి. దాదాపుగా రూ.70 వేల వరకు రాయితీతో పాటు మరెన్నో ఆఫర్లు కూడా కల్పిస్తున్నాయి. మరెందుకు ఆలస్యం... పూర్తి వివరాలు తెలుసుకుందాం.

new car offers and discounts
Best Discounts on cars June 2023

New car discount offers : సొంత కారు కొనుక్కోవాలని కలలు కనే ప్రతి ఒక్కరికీ మంచి అవకాశం. టాప్​ బ్రాండ్​ కంపెనీలు ఈ జూన్​ నెలలో సరికొత్త మోడల్​ కార్లను మార్కెట్​లోకి తెస్తున్నాయి. వీటితో బాటు భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు కూడా కల్పిస్తున్నాయి. మరెందుకు ఆలస్యం సొంత కారు ఇంటికి తీసుకువెళ్లడానికి సిద్ధంకండి.

Top 5 Best Discounts on cars June 2023
ఈ జూన్​ నెలలో భారీ డిస్కౌంట్స్,​ ఆఫర్స్​ ఉన్న టాప్​ 5 బ్రాండ్​ కార్ల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా Maruti Suzuki, Renault కంపెనీలు మత సరికొత్త బ్రాండ్​ కార్లలో కొన్ని ఎంపిక చేసిన మోడల్స్​పై రూ.70,000 వరకు డిస్కౌంట్​తో పాటు, మరిన్ని ఆఫర్లు కూడా​ ప్రకటించాయి. మరి ఆయా మోడల్స్ ఏవో తెలుసుకుందామా?

1. Maruti Suzuki Ignis offers in June 2023
మారుతీ సుజుకీకి చెందిన ఎంట్రీ లెవల్​ ప్రీమియం కారు ఇగ్నిస్. ప్రస్తుతం మారుతీ ఈ మోడల్​ కార్లను మన దేశంలో తన నెక్సా అవుట్​లెట్స్​లో విక్రయిస్తోంది. ఈ జూన్​ నెలలో మారుతీ సుజుకీ.... ఇగ్నిస్​లో AMT మోడల్​ కార్లపై రూ.69,000 వరకు డిస్కౌంట్​ ఇస్తోంది. ముఖ్యంగా దీనిలో రూ.50,000 వరకు క్యాష్​ డిస్కౌంట్​, రూ.10,000 వరకు ఎక్స్ఛేంజ్​ బోనస్​ రూపంలో డిస్కౌంట్​ ఉంటుంది. దీనికి తోడు స్క్రాప్​ బోనస్​ కింద రూ.5,000, కార్పొరేట్​ డిస్కౌంట్​ రూ.4,000 వరకు అందిస్తోంది. మరెందుకు ఆలస్యం... బుల్లి మారుతీని సొంతం చేసుకోవాలనుకునే వారికి ఇదే మంచి అవకాశం.

offers on maruti suzuki igins
మారుతి ఇగ్నీస్

2. Renault Kiger Discounts June 2023
రెనాల్ట్స్​ కైజర్​ మరో మంచి బ్రాండ్​ కారు. ప్రస్తుతం ఈ కంపెనీ కూడా తన కైజర్ RXT, RXT ఆప్షన్​ వేరియంట్స్​పై​ రూ.67,000 వరకు డిస్కౌంట్​ ప్రకటించింది. ముఖ్యంగా రూ.25,000 వరకు క్యాష్​ డిస్కౌంట్​, ఎక్స్ఛేంజ్​ బోనస్​ కింద రూ.20,000 అందిస్తుంది. వీటితోపాటు రూ.12,000 వరకు కార్పొరేట్​ డిస్కౌంట్​ కల్పిస్తోంది. ఈ జూన్​ నెలలో కొన్నవారికి ప్రత్యేకంగా రూ.10,000 వరకు Loyalty బోనస్​ అందిస్తోంది.

renault kiger car offers
రెనాల్ట్స్​ కైజర్ కారు

3. Maruti Suzuki Alto K10 Offers
మారుతీ సుజుకీ తన Alto K10 వెర్షన్​ను భారతదేశంలో మళ్లీ సరికొత్తగా విడుదల చేసింది. దాదాపు ఒక దశాబ్ధం తరువాత మారుతీ సుజుకీ తమకు అచ్చివచ్చిన K10 మోడల్​ని భారతదేశానికి తీసుకొచ్చింది. ముఖ్యంగా ఆల్టో కే10 పెట్రోల్​ MT వేరియంట్​పై రూ.59,000 వరకు డిస్కౌంట్​ ప్రకటించింది. ఇందులో ప్రధానంగా రూ.40,000 వరకు క్యాష్​ డిస్కౌంట్​, రూ.15,000 వరకు ఎక్స్ఛేంజ్​ బోనస్​, కార్పొరేట్​ డిస్కౌంట్​ రూ.4000 ఉంటుంది.

discounts on Maruti Suzuki Alto K10 car
మారుతీ సుజుకీ ఆల్టో కే10 కారు

4. Maruti Suzuki S Presso June offers
మారుతీ సుజుకీ ఎస్​ ప్రెస్సో పెట్రోల్​ MT VXI+ వేరియంట్​పై రూ.58,000 వరకు డిస్కౌంట్​ లభిస్తోంది. ఇందులో రూ.39,000 వరకు క్యాష్​ డిస్కౌంట్​, రూ.15,000 వరకు ఎక్స్ఛేంజ్​ బోనస్​, కార్పొరేట్​ డిస్కౌంట్​ రూ.4000 రూపంలో లభిస్తుంది.

deals on Maruti Suzuki S Presso
మారుతీ సుజుకీ ఎస్​ ప్రెస్సో కారు

5. Discounts on Renault kwid cars in June 2023
2015లో భారతదేశంలో లాంఛ్​ అయిన రెనాల్ట్​ క్విడ్​ మంచి జనాదరణ పొందింది. ఈ ఎంట్రీ లెవల్ క్విడ్​​ కారుపై కంపెనీ రూ.57,000 వరకు రాయితీ ప్రకటించింది. ఇందులో రూ.15,000 వరకు క్యాష్​ డిస్కౌంట్​, రూ.20,000 వరకు ఎక్స్ఛేంజ్​ బోనస్​, కార్పొరేట్​ డిస్కౌంట్​ రూ.12,000 రూపంలో లభిస్తుంది. వీటికి అదనంగా ఈ జూన్​ నెలలో కారు కొన్నవారికి రూ.10,000 వరకు loyalty బోనస్​ అందిస్తోంది. మరెందుకు ఆలస్యం... మీకు నచ్చిన కలల కారుని వెంటనే మీ సొంత చేసుకోండి.

offers and deals on renault kwid cars
రెనాల్ట్​ క్విడ్​ కారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.