ETV Bharat / business

Higher Interest for Women on Fixed Deposit : ఈ బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల్లో.. మహిళల పెట్టుబడికి అధిక వడ్డీ..! - మహిళల కోసం ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్

Higher Interest for Women on Fixed Deposit : మహిళలు డబ్బు పొదుపు చేస్తే.. కొన్ని బ్యాంకులు, ఫైనాన్స్‌ సంస్థలు ప్రత్యేకంగా అదనపు వడ్డీని అందిస్తున్నాయి. మరి, ఆ బ్యాంకులు, సంస్థల గురించి మీకు తెలుసా..? ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

Higher Interest for Women on Fixed Deposit

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 21, 2023, 3:48 PM IST

Higher Interest for Women on Fixed Deposit : మారుతున్న కాలానికి అనుగుణంగా స్త్రీలు ఇప్పుడు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. వారు చదువుకుని ఆర్థికంగా కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నారు. పిల్లలు, కుటుంబ బాధ్యతలను తీసుకొని ముందు చూపుతో డబ్బులను పొదుపు చేస్తుంటారు. అయితే.. దేశంలో కొన్ని బ్యాంకులు, ఫైనాన్స్‌ సంస్థలు ప్రత్యేకంగా మహిళల కోసం ఏర్పాటయ్యాయి. ఇవి స్త్రీలకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లలో ఎక్కువ వడ్డీ రెట్లను సైతం అందిస్తున్నాయి. అవి ఏవి? ఎంత శాతం వడ్డీ రేటును అందిస్తున్నాయి? ఖాతా తేరవడానికి కావాల్సిన అర్హతలేంటి? అనే వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

భారతీయ మహిళా బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ :
భారతీయ మహిళా బ్యాంక్ (BMB) 2012లో ఏర్పాటైంది. దేశంలోని మహిళలు ఆర్థికంగా తమను తాము నిలదొక్కుకోవడానికి ఈ బ్యాంకు అవకాశం కల్పిస్తోంది. ఈ బ్యాంకు మూడు రకాలైన ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లను కల్పిస్తుంది. అవి బీఎమ్‌బీ సింపుల్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌, బీఎమ్‌బీ క్యుములేటివ్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌, బీఎమ్‌బీ టాక్స్‌ బెన్‌ఫిట్‌.

భారతీయ మహిళా బ్యాంక్‌లో ఖాతా పొందడానికి ఎవరు అర్హులు?
ఈ బ్యాంకులో ఖాతా తెరవడానికి ప్రభుత్వ, ప్రైవేటు మహిళా ఉద్యోగులు అర్హులు. అలాగే వ్యాపారం చేస్తున్న వారు, గృహిణులు కూడా ఇందులో ఖాతా పొందవచ్చు. ఖాతాదారురాలు మైనర్‌ అయితే.. సంరక్షకుని పేరు మీద ఖాతా తెరవవచ్చు. ప్రవాస భారతీయ (NRI) మహిళలకు కూడా ఈ బ్యాంకులో ఖాతా పొందవచ్చు.

భారతీయ మహిళ బ్యాంకు FD ప్రయోజనాలు..

  • భారతీయ మహిళ బ్యాంకు అధిక వడ్డీ రేటును, తక్కువ కాలానికే అందిస్తుంది.
  • బ్యాంకు ఖాతాదారు.. ఖాతాకు నామినీ పేరు పెట్టవచ్చు.
  • ఈ బ్యాంకులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసిన మహిళలు, వారు చేసిన FDలో 85 శాతం వరకు లోన్‌ పొందవచ్చు.
  • ఫిక్స్‌డ్ డిపాజిట్ సొమ్ముపై పన్ను వర్తించకుండా ప్రయోజనం పొందవచ్చు.
  • 60 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళలు FDపై అదనంగా 0.50% వడ్డీ రేటును పొందవచ్చు.

బజాజ్ ఫైనాన్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్ :
ఫిక్స్‌డ్ డిపాజిట్ పెట్టుబడి పెట్టాలనుకునే మహిళలకు బజాజ్ ఫైనాన్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌ మంచి ఎంపిక. ఇందులో పెట్టుబడిని 12 నుంచి 60 నెలల వరకు పెట్టవచ్చు. ఈ బజాజ్‌ ఫైనాన్స్‌లో కనీస పెట్టుబడి రూ. 25,000. ఇది 5.65 శాతం నుంచి 6.50 శాతం వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై వడ్డీని ఇస్తుంది.

EPF Interest Earning : ఉద్యోగం మానేసిన తరువాత కూడా.. ఈపీఎఫ్​ ఖాతాలో వడ్డీ జమ అవుతుందా?

బజాజ్ ఫైనాన్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్ పొందేందుకు అర్హత :
బజాజ్ ఫైనాన్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతా తెరవడానికి ప్రభుత్వ, ప్రైవేటు మహిళా ఉద్యోగులు అర్హులు. అలాగే వ్యాపారం చేస్తున్న వారు, ట్రస్టును నడుపుతున్న వారు ఖాతాను పొందవచ్చు. ఖాతాదారురాలు మైనర్‌ అయితే, సంరక్షకుని పేరు మీద ఖాతా తెరవవచ్చు. అలాగే, సీనియర్ సిటిజన్ల కేటగిరీలోని మహిళలు, మాజీ సర్వీస్ కేటగిరీలోని మహిళలు, వితంతువులు అదనపు వడ్డీ రేటుతో బజాజ్ ఫైనాన్స్ FD ఖాతాలను తెరవవచ్చు.

బజాజ్ ఫైనాన్స్ FD ప్రయోజనాలు

  • FDని ప్రారంభించడానికి కనీసం రూ.25,000 పెట్టుబడి.
  • ఖాతాదారురాలికి ఆదాయపు పన్ను చట్టం, 1961 లోని 80C ప్రకారం పన్ను మినహాయింపు ఉంటుంది.
  • డిపాజిట్ చేసిన మొత్తంలో 75% రుణ సదుపాయాన్ని పొందవచ్చు.

How to Apply SBI Amrit Kalash Scheme : ఎస్​బీఐ కస్టమర్లకు గుడ్​న్యూస్​.. రూ.1 లక్ష పెడితే ఎంత వడ్డీ వస్తుందంటే..?

DHFL స్వయంసిధ డిపాజిట్ స్కీమ్‌ :
దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (DHFL) మహిళల కోసం 'స్వయంసిధ' పేరుతో ఒక ప్రత్యేక వడ్డీ రేటు పథకాన్ని తీసుకువచ్చింది. ఇందులో చేరిన వారికి సంవత్సరానికి 7.80 శాతం వడ్డీని అందిస్తారు.

DHFL స్వయంసిధ డిపాజిట్ పొందేందుకు అర్హత :

  • మహిళలందరూ ఈ స్కీమ్‌లో ఖాతాను పొందవచ్చు.
  • ఖాతాదారురాలు మైనర్‌ అయితే, సంరక్షకుని పేరు మీద ఖాతా తెరవవచ్చు. ఒకవేళ జాయింట్‌ అకౌంట్‌ తీసుకుంటే ప్రాథమిక లబ్ధిదారు స్త్రీ అయి ఉండాలి. ఇంకొకరు పురుషుడు కావచ్చు.
  • ఉమ్మడి ఖాతాలో గరిష్ఠంగా ముగ్గురు సభ్యులు ఉండవచ్చు.

DHFL స్వయంసిధ డిపాజిట్ ప్రయోజనాలు

  • సీనియర్ సిటిజన్లు (మహిళలు), సాయుధ దళాల సిబ్బంది, వితంతువులు, రుణగ్రహీతలు వంటి ప్రత్యేక ఖాతాదారులు 0.25% అదనపు వడ్డీ రేటును పొందవచ్చు.
  • డిపాజిట్ చేసిన మొత్తంలో 75% వరకు మహిళలకు FDపై లోన్ సౌకర్యం పొందవచ్చు.
  • ఈ పథకంలో నమోదైన మహిళలు మరణిస్తే రూ.లక్ష ఉచిత ప్రమాద బీమా కవరేజీ ఉంటుంది.
  • ఈ పథకం ద్వారా సంపాదించిన నగదు వడ్డీపై రూ.5,000 పన్ను మినహాయింపు ఉంటుంది.
  • ఖాతాదారురాలు మెచ్యూరిటీ తేదీ తరవాత మరోసారి డిపాజిట్‌ చేయాలనుకుంటే.. మెచ్యూరిటీ తేదీకి 6 నెలల ముందు అభ్యర్థించాలి. అప్పుడు అవకాశం ఉంటుంది.

SBI Wecare Special Fixed Deposit Scheme: ఎస్​బీఐ నుంచి సూపర్ స్కీం.. కొద్దిరోజులే ఛాన్స్!

Post Office Schemes Interest Rates : పోస్టాఫీస్​ పథకాల్లో మదుపు చేస్తున్నారా?.. లేటెస్ట్ వడ్డీ రేట్లు ఇవే!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.