ETV Bharat / business

FD VS NSC : ఫిక్స్​డ్​ డిపాజిట్​ Vs నేషనల్​ సేవింగ్స్​ సర్టిఫికేట్​.. ఏది బెస్ట్ ఛాయిస్​? - personal finance news in telugu

Bank Fixed Deposit vs National Savings Certificate : సంపాదించిన డబ్బులపై అధిక రాబడి పొందేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. ముఖ్యంగా ఫిక్స్​డ్ డిపాజిట్లతో పాటు నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ లాంటి కేంద్ర ప్రభుత్వ పథకాలు చాలా ఉన్నాయి. ఈ రెండింటిలో ఏది బెటర్​ ఛాయిస్​ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

FD VS NSC
Bank Fixed Deposit vs National Savings Certificate
author img

By

Published : Jul 29, 2023, 3:46 PM IST

FD VS NSC : కష్టపడి, చెమటోడ్చి సంపాదించిన డబ్బులను ఎక్కడ పొదుపు చేయాలనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ధనాన్ని ఎక్కడ పడితే అక్కడ కాకుండా రెట్టింపు ఆదాయం వచ్చే చోట పొదుపు చేయడం అవసరం. అందుకోసం పొదుపు మార్గాలను అన్వేషించాల్సి ఉంటుంది. పిల్లల చదువులు, ఆరోగ్య ఖర్చులు, గృహ నిర్మాణం, రిటైర్మెంట్ అనంతర జీవితం కోసం ముందు నుంచే పొదుపు చేయడం మంచిది. కనుక ఉత్తమ పొదుపు మార్గాలు ఏవో తెలుసుకుని డబ్బులను జాగ్రత్తగా మదుపు చేస్తే సరిపోతుంది. ఈ నేపథ్యంలో అధిక రాబడిని అందించే వాటిల్లో ఏది బెస్ట్ స్కీమ్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ఫిక్స్​డ్ డిపాజిట్లు
Bank Fixed Deposit Benefits : డబ్బులను పెట్టుబడి పెట్టేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. వీటిల్లో ఒకటి ఫిక్స్​డ్ డిపాజిట్లు (ఎఫ్​డీ). ఇది అందరికీ సుపరిచితమే. అన్ని ఖర్చులూ పోనూ తమ దగ్గర ఉన్న కొంత మిగులు సొమ్ముపై హామీ పూర్వకమైన రిటర్న్ కావాలని భావిస్తే ముందే ఆలోచించి బ్యాంకుల్లో ఫిక్స్​డ్ డిపాజిట్ చేసుకోవచ్చు. వీటికి సంబంధించి పలు రకాల పథకాలను ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు అందిస్తుంటాయి. ఆయా కంపెనీల బ్రాంచ్​లకు వెళ్లి ఎఫ్​డీల్లో డబ్బులను డిపాజిట్ చేయొచ్చు. అయితే ఫిక్స్​డ్ డిపాజిట్లపై చెల్లించే వడ్డీ రేటు మాత్రం స్థిరంగా ఉంటుంది. మనం ఎంత కాలానికి డబ్బులను డిపాజిట్ చేస్తే అంత కాలానికి నిర్దేశిత వడ్డీరేటును హామీ పూర్వకంగా పొందే వీలు ఉంటుంది.

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్
National Savings Certificate Benefits : డబ్బులను పెట్టుబడిగా పెట్టేవారు ఎక్కడ తక్కువ రిస్క్ ఉంటుంటో అక్కడే ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు. అలా రిస్క్ తక్కువగా ఉండే వాటిల్లో ఫిక్స్​డ్ డిపాజిట్లు ముందు వరుసలో ఉంటాయి. అయితే మోడీ ప్రభుత్వం అందిస్తున్న కొన్ని పథకాల్లో కూడా మంచి రాబడి అందుతోంది. అలాంటి వాటిల్లో ఒకటే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్. ఈ పథకంలో భాగంగా రూ.1,000 ఉన్నా సరే ఎన్​ఎస్​సీ ఖాతాను ఓపెన్​ చేయవచ్చు. ఇంత మొత్తంలోనే పెట్టుబడి పెట్టాలని నియమం ఏమీ లేదు. ఎంత భారీ మొత్తంలోనైనా డబ్బులను ఇక్కడ దాచుకోవచ్చు.

పన్ను మినహాయింపులు
ఎన్​ఎస్​సీ పథకంతో పాటు బ్యాంకులు అందించే ఐదేళ్ల లాకిన్ పీరియడ్ డిపాజిట్లకు పన్ను మినహాయింపులు ఉంటాయి. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం జులై-సెప్టెంబర్ త్రైమాసికానికి గాను నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ పథకం వడ్డీ రేటును 7.7 శాతంగా నిర్ణయించింది. అందువల్ల పెట్టుబడులు పెట్టేందుకు ఫిక్స్​డ్​ డిపాజిట్లు, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్​లో ఏది ఉత్తమమో ఇప్పుడు తెలుసుకుందాం..

వడ్డీ చెల్లింపు
Interest on Fixed Deposit and NSC : నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ పథకంలో పెట్టుబడి పెట్టిన మొత్తంపై ఒకేసారి సంచిత వడ్డీని అందిస్తారు. అదే ఫిక్స్​డ్ డిపాజిట్ల విషయంలో మాత్రం ఇది వేరేలా ఉంటుంది. ఎఫ్​డీల మీద మెచ్యూరిటీని బట్టి ప్రతి నెలా లేదా త్రైమాసికానికి ఒకసారి వడ్డీని అందిస్తారు.

వడ్డీ రేట్ల సమ్మేళనం
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీములో ఏడాదికి ఒకసారి వడ్డీ రేట్లను సమ్మేళనం చేస్తారు. అదే ఫిక్స్​డ్ డిపాజిట్ల విషయంలో త్రైమాసిక ప్రాతిపదికన వడ్డీని లెక్కిస్తారు.

పునరుద్ధరణ
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎన్​ఎస్​సీ) పథకాన్ని ఐదేళ్ల లాకిన్ పీరియడ్ తర్వాత పునరుద్ధరించడానికి వీల్లేదు. కానీ ఫిక్స్​డ్ డిపాజిట్లకు మాత్రం ఆటో-రెన్యూవల్ సౌకర్యం ఉండటం గమనార్హం.

వడ్డీ రేట్లలో మార్పులు
ఎన్​ఎస్​సీ పథకంలో ఒకసారి సర్టిఫికేట్ కొనుగోలు చేశాక ఐదేళ్ల లాకిన్ పీరియడ్ పూర్తయ్యే వరకు వడ్డీ రేటులో ఎలాంటి మార్పు ఉండదు. కానీ బ్యాంకు ఎఫ్​డీల విషయంలో 7 రోజుల నుంచి పదేళ్ల వరకు దీన్ని మార్చుకునేందుకు వీలుంది.

పన్నులు
Tax on Fixed deposits and NSC : నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్​ పథకంలో ఐటీఏలోని సెక్షన్ 80సీ కింద పన్నులను క్లెయిమ్ చేసుకోవచ్చు. ఐదో ఏడాది మనం పెట్టిన పెట్టుబడిపై ఇన్​కం ట్యాక్స్​ స్లాబ్​ ప్రకారం పన్ను విధిస్తారు. అదే ఫిక్స్​డ్ డిపాజిట్లకు ఏడాదికి 10 శాతం చొప్పున టీడీఎస్​ను చెల్లించాల్సి ఉంటుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.