ETV Bharat / business

కార్లకు ఇకపై 'స్టార్​ రేటింగ్స్'.. కేంద్రం కొత్త రూల్స్​! - cars safety rating india

cars safety rating India: దేశంలో రోడ్డు భద్రతను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కొత్త కార్ల అసెస్​మెంట్​ ప్రోగ్రామ్​ను (భారత్​ ఎన్​సీఏపీ) తీసుకురానున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ఈ విధానంలో క్రాష్​ టెస్టుల ఆధారంగా 'స్టార్ రేటింగ్స్' ఇవ్వనున్నట్లు తెలిపారు.

new car assessment program
new car assessment program
author img

By

Published : Jun 24, 2022, 3:53 PM IST

cars safety rating India: దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పటిష్ఠ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కొత్త కార్లకు అసెస్​మెంట్​ ప్రోగ్రామ్​ను (భారత్​ ఎన్​సీఏపీ) ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్​ గడ్కరీ వెల్లడించారు. క్రాష్​ టెస్ట్ ఫలితాల ఆధారంగా 'స్టార్​ రేటింగ్స్' ఇచ్చే ​వ్యవస్థను తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ విధానం పూర్తిగా వినియోగదారుడి కేంద్రంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. దీని ద్వారా ఇచ్చే రేటింగ్స్​తో వినియోగదారుడు.. తనకు నచ్చిన భద్రత గల కార్లను కొనుగోలు చేసే వీలు ఉంటుందన్నారు. దీంతో తయారీదారుల(ఓఈఎమ్​) మధ్య స్నేహపూర్వక పోటీ పెరుగుతుందని.. భారత్​లో భద్రత గల వాహనాల తయారవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విధానంలో 1 నుంచి 5 వరకు రేటింగ్స్​ ఇవ్వనున్నట్లు వివరించారు.

ప్రస్తుతం దేశంలో అమల్లో ఉన్న నిబంధనలతో పాటు అంతర్జాతీయ నియమాల మేరకు క్రాష్​ టెస్టులు నిర్వహిస్తామని గడ్కరీ చెప్పారు. స్టార్​ రేటింగ్స్ ఇవ్వడంలో క్రాష్​ టెస్టులు ఫలితాలు ముఖ్యమని.. ఈ విధానంతో కార్ల నాణ్యత, ప్రయాణికుల భద్రతతో పాటు భారత వాహనాల ఎగుమతులు పెరుగుతాయన్నారు. ఉత్పత్తిదారులు తమ సొంత తయారీ కేంద్రాల్లోనే పరీక్షించుకునే సదుపాయం సైతం కల్పిస్తామని తెలిపారు. ఈ విధానం ఆటోమొబైల్​ రంగంలో మేక్​ ఇన్​ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ కీలక పాత్ర పోషిస్తుందని.. ప్రపంచంలోనే భారత్​ ఆటోమొబైల్​ హబ్​గా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. భద్రతగల కార్లు తయారు చేసే ఈ ప్రక్రియలో ఉత్పత్తిదారులు స్వచ్ఛందంగా పాల్గొనేలా ప్రోత్సహిస్తుందన్నారు గడ్కరీ.
2020లో 3,66,138 ప్రమాదాలు జరగగా.. సుమారు 1,31,714 మంది మరణించారు. 2024 నాటికి రోడ్డు ప్రమాదాల శాతాన్ని 50 శాతానికి తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు గడ్కరీ చెప్పారు.

ఇదీ చదవండి: టర్మ్‌ పాలసీ తీసుకుంటున్నారా? అయితే ఈ ప్రయోజనాల గురించి తెలుసుకోండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.