ETV Bharat / business

చైనాకు 'ఎంఎన్​సీ'లు షాక్​.. ప్రపంచ తయారీ కేంద్రంగా భారత్! - ఐఫోన్ 14 న్యూస్

ప్రపంచ కర్మాగారంగా చైనాను భారత్‌ భర్తీ చేయనుందా? చైనాలో కొవిడ్‌ లాక్‌డౌన్లతో విసిగిపోయిన బహుళజాతి కంపెనీలు భారత్‌వైపు చూస్తున్నాయా? ఐఫోన్‌ 14ను భారత్‌లో తయారీ చేయాలని యాపిల్ సంస్థ తీసుకున్న నిర్ణయం గ్లోబల్‌ సంస్థల వైఖరిలో మార్పునకు సంకేతంగా భావించవచ్చా? అవుననే అంటున్నారు నిపుణులు. భారత్‌ ప్రపంచ తయారీ కేంద్రంగా మారుతోందని చెబుతున్నారు.

iphone 14 manufacturing in india
భారత్ చైనా
author img

By

Published : Oct 6, 2022, 10:34 PM IST

బహుళజాతి కంపెనీలకు తయారీ కేంద్రంగా భారత్ మారనున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్‌ 14ను భారత్‌లో తయారు చేయనున్నట్లు యాపిల్‌ గత వారమే ప్రకటించింది. చైనా వెలుపల తయారీని విస్తరించడానికి యాపిల్‌ వేసిన వ్యూహాత్మక అడుగుగా దీన్ని భావిస్తున్నారు. 2025 నాటికి యాపిల్‌ కంపెనీ తయారు చేసే ఐఫోన్లలో 25 శాతం భారత్‌లోనే ఉత్పత్తి అవుతాయనేది విశ్లేషకుల అంచనా. 2017 నుంచి తమిళనాడులో ఐఫోన్లను యాపిల్‌ సంస్థ తయారీ చేస్తోంది. ఇప్పటివరకు ప్రపంచ కర్మాగారంగా చైనా పేరుగాంచింది. కానీ అమెరికా, చైనా మధ్య ఉద్రిక్తతలు అంతకంతకూ పెరగడం, జీరో కొవిడ్‌ విధానం కారణంగా చైనా సర్కారు తరచూ విధిస్తున్న లాక్‌డౌన్లు అక్కడి గ్లోబల్‌ సంస్థలకు ఇబ్బందికరంగా మారాయి. బహుళజాతి సంస్థల సరఫరా గొలుసుపై ఇవి తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో చైనా కాకుండా ప్రత్యా‌‌మ్నాయ దేశాలను సంస్థలు అన్వేషిస్తున్నాయి. చైనాలో విధానాలు మారే వరకు గ్లోబల్‌ సంస్థలు ఎదురు చూడడం లేదని అవి ప్రత్యామ్నాయలు వెతుకుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా భారత్‌, వియత్నం, మెక్సికో వంటి దేశాలవైపు గ్లోబల్‌ సంస్థలు చూస్తున్నాయని చెబుతున్నారు. భారత్‌లో తయారీకి పెద్దపీట వేస్తూ మోదీ సర్కారు కల్పిస్తున్న ఆర్థిక ప్రోత్సాహకాలు కూడా గ్లోబల్‌ సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి కారణంగా నిలుస్తోంది. ఇటీవలే వేదాంత రిసోర్సెస్.. తైవాన్ ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం ఫాక్స్‌కాన్‌తో కలిసి భారత్​లో సెమీకండక్టర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి దాదాపు 20 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది.

ప్రస్తుతం భారత్‌.. ఆసియాలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. బహుళజాతి కంపెనీలను ఆకర్షిస్తోంది. తక్కువ ఖర్చుతో కార్మికులు దొరుకుతుండటం, అతిపెద్ద దేశీయ మార్కెట్‌ ఉండటం భారత్‌కు కలిసి వస్తోంది. 6 నుంచి 7 శాతం జీడీపీ వృద్ధితో ప్రపంచ వ్యాప్తంగా వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉండటం కూడా భారత్‌కు అనుకూలంగా మారింది. నైపుణ్యం కలిగిన కార్మిక శక్తిని పెంచుకుంటే బహుళజాతి సంస్థలను మరింత ఆకర్షించవచ్చని నిపుణులు అంటున్నారు. సులభతర వాణిజ్యంలో థాయిలాండ్‌, వియత్నం, దక్షిణకొరియా వంటి ఆసియా దేశాలు భారత్‌ కంటే ముందున్నాయి. ఈ విషయంలో భారత్ ఇంకా మెరుగుపడాల్సి ఉంది.

ఇవీ చదవండి: 30 రెట్లు అధిక వేగంతో ఎయిర్​టెల్ 5జీ సేవలు.. 1.5 జీబీపీఎస్ దాటిన జియో!

ఏడాదిలో ఆర్థిక మాంద్యం.. మెజారిటీ సీఈఓల అంచనా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.