Amul Milk Price Increased: అమూల్ పాల ధరలు మరోసారి పెరిగాయి. ఫుల్ క్రీమ్ మిల్క్, గేదె పాలపై లీటర్‌కు రూ.2 చొప్పున పెంచుతున్నట్లు అమూల్ బ్రాండ్ పేరిట మార్కెటింగ్ చేసే గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎఫ్) వెల్లడించింది. గుజరాత్ మినహా అన్ని రాష్ట్రాల్లోనూ పెరిగిన ధరలు అమలవుతాయని ఫెడరేషన్ ఎండీ ఆర్‌ఎస్ సోథి తెలిపారు. తాజా పెంపుతో ప్రస్తుతం ఫుల్ క్రీమ్ మిల్క్ లీటర్ ధర రూ.61 ఉండగా.. శనివారం నుంచి దాని ధర రూ.63కు చేరింది.
అమూల్ పాల ధరలు పెంచడం ఈ ఏడాది వరుసగా ఇది మూడోసారి. ఆగస్టులో అన్ని రకాల పాలపై లీటర్‌కు రూ.2 చొప్పున పెంచుతున్నట్లు అమూల్ ప్రకటించింది. పాల ప్యాకేజీ, రవాణా, పశుగ్రాసం వ్యయాలను కారణంగా చూపుతూ అంతకుముందు మార్చిలో సైతం పాల ధరను రూ.2 చొప్పున పెంచింది. అమూల్ పాల ధరల పెంపుపై ముందుగానే ప్రకటన విడుదల చేస్తుంది. కానీ ఈసారి ధర పెంచిన తర్వాత పెంపు నిర్ణయాన్ని ప్రకటించింది.
ఇదీ చదవండి: కట్టలు తెంచుకొని ఆకాశానికి ఎగబాకుతున్న డాలర్.. వాణిజ్య లోటుతో దేశాలు విలవిల!
'కాఫ్ సిరప్'లపై పూర్తి స్థాయి పరిశీలన.. గాంబియా ఘటనతో అప్రమత్తత!