ETV Bharat / business

Amazon Prime Video : అమెజాన్​ ప్రైమ్​ వీడియోస్​లో.. ఇకపై బీబీసీ ప్లేయర్​, కిడ్స్​ కంటెంట్​!

author img

By

Published : Jul 21, 2023, 12:57 PM IST

Amazon Prime Video News : ఓటీటీలో ప్రియులకు గుడ్​ న్యూస్​. అమెజాన్​ ప్రైమ్​ వీడియో యాడ్​-ఆన్​ ఛానళ్లుగా బీబీసీ ప్లేయర్​, బీబీసీ కిడ్స్​ అందుబాటులోకి వచ్చాయి. దీనితో యూజర్లు ప్రైమ్​ వీడియోలతో సహా, నేరుగా బీబీసీ కంటెంట్​ను కూడా చూడగలుగుతారు. మరిన్ని పూర్తి వివరాలు మీ కోసం..

BBC Player and BBC Kids
Amazon Prime Video

Amazon Prime Video Latest News : అమెజాన్​ ప్రైమ్​ వీడియో యూజర్లకు గుడ్​ న్యూస్​. ఇకపై ప్రైమ్ వీడియో చందాదారులు.. బీబీసీ ప్లేయర్, బీబీసీ కిడ్స్​ వీడియోలను కూడా ఇదే వేదికలో వీక్షించవచ్చు. ఈ మేరకు అమెజాన్​, బీబీసీ స్టూడియోలు ఒక ప్రకటన విడుదల చేశాయి.

Amazon Prime Video Add on channels : బీబీసీ స్టూడియోకు చెందిన బీబీసీ ప్లేయర్​, బీబీసీ కిడ్స్.. ఇకపై​ అమెజాన్​ ప్రైమ్​ వీడియోకు యాడ్​-ఆన్​ ఛానళ్లుగా ఉంటాయి. దీని ద్వారా ప్రైమ్​ యూజర్లు.. నేరుగా బ్రిటీష్​ డ్రామాలు, కామెడీ షోలు, డాక్యుమెంటరీలు, ఎంటర్​టైన్మెంట్​, లైఫ్​ స్టైల్​ ప్రోగ్రాంలు, చిల్డ్రన్​షోలు వీక్షించడానికి వీలవుతుంది.

Amazon Prime Video Subscription Plans : చందాదారులు అమెజాన్​ ప్రైమ్​ వీడియో సబ్​స్క్రిప్షన్​ రుసుముతో సహా మరో రూ.599 చెల్లించి, బీబీసీ ప్లేయర్ యాన్యువల్​​ సబ్​స్క్రిప్షన్​ ప్లాన్​ను పొందవచ్చు. ఈ ప్లాన్​ ద్వారా బీబీసీ కిడ్స్​ను కూడా చూడవచ్చు. లేదంటే, కేవలం రూ.199 చెల్లించి, బీబీసీ కిడ్స్​ మాత్రమే సబ్​స్క్రైబ్​ చేసుకోవచ్చు.

అమెజాన్​, బీబీసీ కలిసి..
BBC studio collaborate with amazon prime video : అమెజాన్​ ప్రైమ్​ వీడియోతో కలిసి మొదటిసారిగా భారతీయ వీక్షకులకు బీబీసీ ప్లేయర్​, బీబీసీ కిడ్స్​లను అందుబాటులోకి తెస్తున్నామని బీబీసీ స్టూడియోస్​ పేర్కొంది. ఇదే విషయాన్ని అమెజాన్​ ప్రైమ్ వీడియో కూడా ధ్రువీకరించింది. భారత్​లో తమ ఓటీటీ యూజర్లను మరింతగా పెంచుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.

BBC Player shows 2023 : బీబీసీ ప్లేయర్​లో వెరైటీ ఆఫ్​ షోస్​ ఉన్నాయి. సిక్స్​ఫోర్​, పొలిటికల్ థ్రిల్లర్​ ది డిప్లొమాట్​, సిట్​కామ్​ సిటిజెన్​ ఖాన్​, షెర్లాక్​​, అన్​ఫర్గాటెన్​, హ్యాపీ వ్యాలీ, టాప్​ గేర్​.. లాంటి ఎన్నో పాపులర్​ షోలు ఉన్నాయి.

BBC Kids shows : బీబీసీ కిడ్స్​లో చిన్న పిల్లలను ఎంతగానో అలరించే.. హే డాగీ, గో జిట్టర్స్​, జోజో & గ్రాన్ గ్రాన్​, షారా అండ్​ డక్​, జూనియర్​ బేక్​ ఆఫ్​ లాంటి బ్రిటీష్​ షోలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ చిన్నపిల్లల షోలకు ఎంతో మంచి ఆదరణ ఉంది.

Amazon Prime video add on channels : ప్రైమ్​ వీడియో ఛానళ్లలో ఇప్పటికే.. లయన్స్​గేట్​ ప్లే, డిస్కవరీ ప్లస్​, ఎరోస్​ నౌ, డాకూబే, మనోరమా మాక్స్​, Hoichoi, MUBI, AMC+, షార్ట్స్​టీవీ, ఎకోర్న్​ టీవీ, క్యూరియాసిటీ స్ట్రీమ్​, మైజెన్ టీవీ, మ్యూజియమ్ టీవీ మొదలైనవి ఉన్నాయి. తాజాగా ఈ జాబితాలో బీబీసీ ప్లేయర్​, బీబీసీ కిడ్స్ కూడా​ చేరాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.