Luna Electric Scooter : ద్విచక్ర వాహన ప్రియులకు, ముఖ్యంగా చిరువ్యాపారులకు ఎంతో ఇష్టమైన 'లూనా' త్వరలోనే ఎలక్ట్రిక్ లూనాగా (ఈ-లూనా) మార్కెట్లోకి రానుంది. ఈ విషయాన్ని 'కెనెటిక్ గ్రీన్' సంస్థ ప్రకటంచింది. ఆ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ సులాజా ఫిరోదియా మొత్వానీ త్వరలోనే ఈ-లూనాను మార్కెట్లోకి అందుబాటులోకి తెస్తున్నట్లు స్పష్టం చేశారు. ఒరిజినల్ 'లూనా'లానే ఇది కూడా అద్భుతంగా పనిచేస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
టీవీఎస్‌కు పోటీగా!
Luna E Bike Launch : ప్రస్తుతం మార్కెట్లో దూసుకుపోతున్న ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనం 'టీవీఎస్ ఎక్స్ఎల్ 100'కు ఇది మరో ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు నిపుణులు. ప్రస్తుతం కెనెటిక్ గ్రీన్ సంస్థ మార్కెట్లోకి ప్రవేశపెడుతున్న 'ఈ-లూనా'.. పెర్ఫార్మెన్స్, రేంజ్ విషయంలో కంటే లోడ్ క్యారీయింగ్ కెపాసిటీపైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.
-
A blast from the past!! “Chal Meri Luna” and it’s creator.. my father, Padmashree Mr. Arun Firodia!
— Sulajja Firodia Motwani (@SulajjaFirodia) May 29, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Watch this space for something revolutionary & exciting from Kinetic Green….u r right …it’s “e Luna!!! ❤️@KineticgreenEV @ArunFirodia @MHI_GoI @PMOIndia @ficci_india @IndianIfge pic.twitter.com/4Nh9IHZdm2
">A blast from the past!! “Chal Meri Luna” and it’s creator.. my father, Padmashree Mr. Arun Firodia!
— Sulajja Firodia Motwani (@SulajjaFirodia) May 29, 2023
Watch this space for something revolutionary & exciting from Kinetic Green….u r right …it’s “e Luna!!! ❤️@KineticgreenEV @ArunFirodia @MHI_GoI @PMOIndia @ficci_india @IndianIfge pic.twitter.com/4Nh9IHZdm2A blast from the past!! “Chal Meri Luna” and it’s creator.. my father, Padmashree Mr. Arun Firodia!
— Sulajja Firodia Motwani (@SulajjaFirodia) May 29, 2023
Watch this space for something revolutionary & exciting from Kinetic Green….u r right …it’s “e Luna!!! ❤️@KineticgreenEV @ArunFirodia @MHI_GoI @PMOIndia @ficci_india @IndianIfge pic.twitter.com/4Nh9IHZdm2
వేగంగా దూసుకుపోతుంది!
Luna Electric Bike Speed : సాధారణంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల వేగం కొంచెం తక్కువగా ఉంటుంది. కానీ ఈ ఎలక్ట్రిక్ లూనా గంటకు 50 కి.మీ నుంచి 100 కి.మీ వేగంతో ప్రయాణిస్తుందని కెనెటిక్ గ్రీన్ సంస్థ తెలిపింది. ఎఫ్ఎఎమ్ఈ-2 సబ్సిడీకి కూడా ఇది ఎలిజిబుల్ అవుతుందని సమాచారం.
పవర్ఫుల్ బ్యాటరీలు
Luna Electric Bike Price : ఈ ఎలక్ట్రిక్ లూనాలో స్వాపబుల్ బ్యాటరీలు ఉంటాయి. ఇవి ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీలు కంటే ప్రభావవంతంగా పనిచేస్తాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. తక్కువ ఖర్చుతో అధికంగా, ఎక్కువగా వస్తువులను తీసుకువెళ్లాలనే చిరు వ్యాపారులకు ఈ ఎలక్ట్రిక్ లూనా బాగా ఉపయోగపడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే దీనిలో టాప్ బాక్స్, క్యారియర్లు, ఐస్ బాక్స్‌లు ఏర్పాటుచేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ-లూనాను 2023 జూలై నాటికి రూ.80,000 నుంచి రూ.90,000 ధరతో తీసుకురానున్నట్లు తెలుస్తోంది.
-
Kinetic to launch electric version of Luna https://t.co/POjyodnTJ2 via @ETAuto
— Dr Prashant Mishra (@drprashantmish6) December 27, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Kinetic to launch electric version of Luna https://t.co/POjyodnTJ2 via @ETAuto
— Dr Prashant Mishra (@drprashantmish6) December 27, 2022Kinetic to launch electric version of Luna https://t.co/POjyodnTJ2 via @ETAuto
— Dr Prashant Mishra (@drprashantmish6) December 27, 2022
మార్కెట్లో ఈ- బైక్స్ హవా!
ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల ఈ-బైక్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా బజాజ్ చేతక్, ఓలా ఎస్1, ఓలా ఎస్1 ప్రో, సింపుల్ ఒన్, ఏథర్ 450ఎక్స్, టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్, రివోల్ట్ ఆర్వీ400 బైక్‌లు ఎక్కువగా అమ్మడవుతున్నాయి. అయితే వాటి ధర కొంచెం ఎక్కువగానే ఉందని చెప్పొచ్చు. సామాన్యులకు అది కొంచెం భారమే. కానీ కాలుష్య రహిత వాహనాలను వినియోగించాలనుకునే వారికి ఇవి కచ్చితంగా మంచి ఎంపికే!.