ETV Bharat / business

అదానీకి 3 రోజుల్లో రూ.5.5లక్షల కోట్లు లాస్.. చిక్కుల్లో ఎల్​ఐసీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ - అదానీ పంజాబ్ నేషనల్ బ్యాంక్

దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన హిండెన్​బర్గ్ నివేదిక.. అదానీ గ్రూప్​ షేర్లపై ప్రతికూల ప్రభావం చూపింది. ఆ గ్రూపునకు సంబంధించిన వేర్వేరు సంస్థల వాటాలు అమ్మకాల ఒత్తిడికి గురికాగా.. మూడు రోజుల్లో రూ.5.56లక్షల కోట్ల మార్కెట్ విలువ తగ్గింది. మరోవైపు.. అదానీ గ్రూపునకు రుణాలు ఇచ్చిన ఎల్​ఐసీ సహా కొన్ని బ్యాంకులకూ హిండెన్​బర్గ్ సెగ తగిలింది.

Adani vs Hindenburg
Adani vs Hindenburg
author img

By

Published : Jan 30, 2023, 7:30 PM IST

అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్​ హిండెన్​బర్గ్​ రీసెర్చ్​ ఆరోపణల నేపథ్యంలో అదానీ గ్రూప్ షేర్లు వరుసగా మూడో సెషన్​లోనూ నష్టాలు చవిచూశాయి. అదానీ గ్రూప్​లోని దాదాపు అన్ని సంస్థల షేర్లు సోమవారం అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. గత మంగళవారం స్టాక్​ మార్కెట్ల ముగింపుతో పోల్చితే సోమవారానికి అదానీ గ్రూప్ మార్కెట్ విలువ ఏకంగా రూ.5.56లక్షల కోట్లు తగ్గింది.

  • గత మంగళవారం క్లోజింగ్​తో పోల్చితే అదానీ టోటల్ గ్యాస్ షేర్ల విలువ 39.57శాతం క్షీణించింది.
  • అదానీ ట్రాన్స్​మిషన్​ షేర్ల విలువ 37.95శాతం దిగజారింది.
  • అదానీ గ్రీన్ ఎనర్జీ వాటాల విలువ 37.93శాతం తగ్గింది.
  • అంబుజా సిమెంట్స్​ షేర్లు గత మంగళవారంతో పోల్చితే సోమవారానికి 22.28శాతం నష్టపోయాయి.
  • బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజిలో అదానీ పోర్ట్స్​ వాటాల విలువ 21.55శాతం తగ్గింది.
  • గత మూడు సెషన్లలో ఏసీసీ షేర్ల విలువ 18.47శాతం క్షీణించింది.
  • అదానీ ఎంటర్​ప్రైజెస్​ 16.38శాతం, అదానీ విల్మార్ 14.25శాతం, అదానీ పవర్ 14.24శాతం, ఎన్​డీటీవీ 14.22శాతం మేర నష్టపోయాయి.

ఆ సంస్థలకూ సెగ..
హిండెన్​బర్గ్ నివేదిక ప్రభావం.. అదానీ గ్రూప్ షేర్లకు మాత్రమే పరిమితం కాలేదు. అదానీ సంస్థలకు రుణాలు ఇచ్చిన వేర్వేరు సంస్థలు, బ్యాంకుల వాటాలూ అమ్మకాల ఒత్తిడికి గురవుతున్నాయి. గత మూడు రోజుల్లో బ్యాంక్​ ఆఫ్​ బరోడా షేర్లు 10.93శాతం నష్టపోయాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు 9.42శాతం, ఎల్​ఐసీ వాటాలు 6.52శాతం మేర క్షీణించాయి.

  • రుణాలు, ఈక్విటీల రూపంలో తమ సంస్థకు సంబంధించి మొత్తం రూ.36,474.78కోట్లు అదానీ గ్రూప్​లో ఉన్నట్లు సోమవారం ప్రకటించింది ఎల్​ఐసీ. ఇది తమ మొత్తం పెట్టుబడుల్లో ఒక శాతంకన్నా తక్కువేనని స్పష్టం చేసింది. అయితే.. అదానీ గ్రూప్​లోని ఏ సంస్థకు ఎంత రుణమిచ్చారు, ఎంత పెట్టుబడి పెట్టారన్న విషయాన్ని ఎల్​ఐసీ వెల్లడించలేదు.
  • అదానీ గ్రూప్​లో రుణాలు, పెట్టుబడుల రూపంలో తమవి రూ.7000కోట్లు ఉన్నట్లు ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్రకటించింది. ఇందులో రూ.2,500కోట్లు ఎయిర్​పోర్ట్ వ్యాపారాలకు సంబంధించినవని తెలిపింది. అదానీ గ్రూప్​ పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్పష్టం చేసింది.

అదానీ ఎంటర్​ప్రైజెస్​ రూ.20వేల కోట్ల ఎఫ్​పీఓ జనవరి 27న ప్రారంభం కావడానికి రెండు రోజుల ముందు వెలువడిన హిండెన్​బర్గ్ రీసెర్చ్ నివేదిక భారతీయ వ్యాపార వర్గాల్ని ఒక్కసారిగా ఉలికిపాటుకు గురిచేసింది. షేర్ల విలువలు పెంచేందుకు అదానీ గ్రూప్ అవకతవకలకు పాల్పడుతోందన్న ఆరోపణలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. శుక్రవారం ఒక్కరోజే అదానీ గ్రూప్ షేర్లు ఏకంగా 20శాతం నష్టపోయాయి. ఇదే విషయమై అదానీ గ్రూప్, హిండెన్​బర్గ్ రీసెర్చ్ మధ్య రెండు రోజులుగా మాటల యుద్ధం జరుగుతోంది. ఈ నివేదికను.. భారత దేశంపై దాడిగా అదానీ గ్రూప్ అభివర్ణించింది. ఆరోపణలన్నింటినీ ఖండిస్తూ ఆదివారం ప్రకటన విడుదల చేసింది. సోమవారం హిండెన్​బర్గ్ అదానీ గ్రూప్​ ప్రకటనకు కౌంటర్ ఇచ్చింది. జాతీయవాదం పేరు చెప్పి అక్రమాల్ని కప్పిపుచ్చలేరని ఎదురుదాడి చేసింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.