ETV Bharat / business

Acer EV Scooter Launch : స్టన్నింగ్​ ఫీచర్స్​తో.. ఏసర్​ ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంఛ్​.. ధర ఎంతంటే? - acer MUVI 125 4G Specs

Acer EV Scooter Launch In Telugu : ఏసర్ కంపెనీ తమ మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్​ను ఇండియన్​ మార్కెట్​లో విడుదల చేసింది. దీనిలో ఉన్న స్పెషాలిటీ ఏమిటంటే.. ఆండ్రాయిడ్​, ఐఓఎస్​ స్మార్ట్​ఫోన్​లను​ ఉపయోగించి.. ఈ స్కూటర్​ను ఇంటరాక్టివ్​ మెషీన్​గా కూడా మార్చవచ్చు. పూర్తి వివరాలు మీ కోసం.

Acer EV Scooter features
Acer EV Scooter Launch
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 16, 2023, 11:30 AM IST

Acer EV Scooter Launch : తెవాన్​కు చెందిన ప్రముఖ మల్టీనేషనల్​ టెక్నాలజీ కార్పొరేషన్​ ఏసర్​.. ఇండియన్ మార్కెట్​లో తన మొదటి ఎలక్ట్రిక్​ స్కూటర్​ MUVI 125 4Gని లాంఛ్ చేసింది. భారతీయ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్లాట్​ఫారమ్​ eBikeGo భాగస్వామ్యంతో ఈ సరికొత్త ఈవీ స్కూటర్​ను తీసుకురావడం జరిగింది. వాస్తవానికి ఈ స్కూటర్​​ రూపకల్పన, తయారీ మొత్తం 'ఈబైక్​గో' ఆధ్వర్యంలోనే జరిగింది.

ప్రీ-బుకింగ్స్​
ఏసర్ కంపెనీ త్వరలోనే MUVI 125 4G ఎలక్ట్రిక్​ స్కూటర్​ ప్రీ-బుకింగ్స్​ను ఓపెన్​ చేయనుంది. అందుకే ఆసక్తిగల ఆటోమొబైల్​ డీలర్లను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొంది. ఆసక్తిగలవారు పూర్తి వివరాల కోసం ఏసర్ అధికారిక వెబ్​సైట్​ను దర్శించాలి.

ACER ​ MUVI 125 4G SCOOTER
ఏసర్ ఎలక్ట్రిక్ స్కూటర్​

MUVI 125 4G Features :
ఏసర్ కంపెనీ 2023 సెప్టెంబర్​లో గ్రేటర్​ నోయిడాలో జరిగిన 'ఈవీ ఇండియా ఎక్స్​పో'లో ఈ MUV1 125 స్కూటర్​ను ప్రదర్శించింది. తాజాగా దీనిని హైదరాబాద్​లో లాంఛ్​ చేసింది.

  • ఈ ఏసర్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​​లో 48V, 35.2Ah సామర్థ్యం గల రెండు స్వాపబుల్​ బ్యాటరీలు అమర్చారు. అందువల్ల వీటిని చాలా సులువుగా మార్చుకోవడానికి వీలవుతుంది.
  • ఈ బ్యాటరీలను ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే.. 80 కి.మీ (రేంజ్​) వరకు ప్రయాణం చేయవచ్చు. అలాగే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్​​తో గరిష్ఠంగా గంటకు 75 కి.మీ వేగంతో ప్రయాణించవచ్చు.
  • ఏసర్​ ఎలక్ట్రిక్ స్కూటర్​​లో అమర్చిన ఈ రెండు బ్యాటరీలను ఫుల్​ ఛార్జ్ చేయడానికి సుమారు 4 గంటల సమయం పడుతుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే.. రైడర్​ అవసరమైతే కేవలం ఒక్క బ్యాటరీతోనూ బైక్​ను నడపవచ్చు.

MUVI 125 4G Specs :
ఏసర్​ తీసుకువచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్​​ పట్టణాల్లో ప్రయాణించడానికి చాలా అనువుగా ఉంటుందని సమాచారం. వాస్తవానికి ఈ స్కూటర్​లో చాలా తేలికైన, ధృఢమైన ఛాసిస్​ను అమర్చారు. పైగా దీనిని షాక్ అబ్జార్బర్​ సిస్టమ్​తో అనుసంధానించారు. ఇది రైడర్​కు మంచి స్థిరత్వాన్ని, రైడింగ్​ అనుభవాన్ని ఇస్తుంది. ఈ స్కూటర్​లో 16 అంగుళాల సన్నని చక్రాలు ఉంటాయి. కనుక​ చాలా స్మూత్​గా రైడింగ్​ చేసుకోవచ్చు.

ACER ​ MUVI 125 4G SCOOTER
ఏసర్ ఎంయూవీఐ స్కూటర్​

టెక్ ప్రియుల కోసం..
టెక్​ ప్రియులకు ఈ ఏసర్ స్కూటర్​ చాలా అనువుగా ఉంటుంది. ముఖ్యంగా దీనిలో బ్లూటూత్​ ఫెసిలిటీ సహా, 4 అంగుళాల ఎల్​సీడీ స్క్రీన్​ను అమర్చారు. ఇక్కడ ఉన్న బెస్ట్ ఛాయిస్ ఏమిటంటే.. ఆండ్రాయిడ్​, ఐఓఎస్​ స్మార్ట్​ఫోన్​ ఉపయోగించి.. ఈ స్కూటర్​ను ఇంటరాక్టివ్​ మెషీన్​గా కూడా మార్చకోవచ్చు.

Acer MUVI 125 Color Variants : ఏసర్ కంపెనీ తీసుకువచ్చిన ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​.. వైట్​, బ్లాక్​, గ్రే అనే మూడు కలర్ వేరియంట్స్​లో లభిస్తుంది.

Acer MUVI 125 Price : ఏసర్ కంపెనీ ఈ నయా ఎలక్ట్రిక్ స్కూటర్​ ధరను రూ.1,00,000 (ఎక్స్​-షోరూం)గా నిర్ణయించింది.

Best Bikes Under 1 Lakh : దసరాకు కొత్త బైక్ కొనాలా?.. రూ.1 లక్ష లోపు బెస్ట్​ బైక్స్​ ఇవే!.. ఫీచర్స్ అదుర్స్​!

Hyundai Car Discounts In October 2023 : దసరాకు కొత్త కారు కొనాలా?.. హ్యుందాయ్​ మోడల్స్​పై భారీ డిస్కౌంట్స్​​​.. ఆ కారుపై ఏకంగా రూ.50వేలు బెనిఫిట్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.