1 June New Rules : నిత్యం ఆర్థిక లావాదేవీలు జరిపేవారికి అలర్ట్. జూన్‌లో కొన్ని కొత్త నిబంధనలు అమల్లోకి రానున్న నేపథ్యంలో మీరు ముఖ్యమైన పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఇవన్నీ మీ ఆర్థిక అంశాలకు సంబంధించినవే. వాటిని పూర్తి చేయకపోతే మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది! పాన్ ఆధార్ లింకింగ్, ఈపీఎఫ్ అధిక పింఛను, ఉచిత ఆధార్ అప్డేట్కు సంబంధించిన పలు గడువు తేదీలు జూన్‌లోనే ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.
పాన్- ఆధార్ లింక్ చేశారా?
PAN Aadhaar Linking: పాన్ కార్డ్, ఆధార్ లింక్ చేయడానికి ఆదాయపు పన్ను శాఖ ఇప్పటికే అనేకసార్లు గడువు పొడిగించింది. చివరిసారిగా మార్చి 31 వరకు ఉన్న డెడ్‌లైన్‌ను జూన్ 30 వరకు పొడిగించింది. పాన్, ఆధార్ లింక్ చేయనివారు రూ.1,000 జరిమానాతో జూన్ 30 వరకు ఈ అనుసంధాన ప్రక్రియ పూర్తి చేయొచ్చు. లేకపోతే ఆ తర్వాత ఆధార్ లింక్ చేయని పాన్ కార్డ్ చెల్లదు.
EPFO అధిక ఫించను కోసం దరఖాస్తు చేశారా?
EPFO Higher Pension: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ).. చందాదారుల అధిక పింఛను కోసం దరఖాస్తు చేసుకొనే గడువును జూన్ 26వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు కొద్దిరోజులే ప్రకటించింది. పదవీ విరమణ తర్వాత అధిక పెన్షన్ కావాలనుకునే వారు.. జూన్ 26లోపు దరఖాస్తు చేసుకోవాలి.
-
Follow these easy steps to file EPF/EPS nomination digitally.#SocialSecurity #EPF #Pension #ईपीएफओ #ईपीएफ #AmritMahotsav @PMOIndia @byadavbjp @Rameswar_Teli @LabourMinistry @PIB_India @MIB_India @AmritMahotsav @mygovindia pic.twitter.com/GP0gJR2H1R
— EPFO (@socialepfo) May 9, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Follow these easy steps to file EPF/EPS nomination digitally.#SocialSecurity #EPF #Pension #ईपीएफओ #ईपीएफ #AmritMahotsav @PMOIndia @byadavbjp @Rameswar_Teli @LabourMinistry @PIB_India @MIB_India @AmritMahotsav @mygovindia pic.twitter.com/GP0gJR2H1R
— EPFO (@socialepfo) May 9, 2023Follow these easy steps to file EPF/EPS nomination digitally.#SocialSecurity #EPF #Pension #ईपीएफओ #ईपीएफ #AmritMahotsav @PMOIndia @byadavbjp @Rameswar_Teli @LabourMinistry @PIB_India @MIB_India @AmritMahotsav @mygovindia pic.twitter.com/GP0gJR2H1R
— EPFO (@socialepfo) May 9, 2023
ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ చేసుకున్నారా?
Income Tax Filing: 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను.. ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైలింగ్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ పని పూర్తి చేయనివారు జూన్‌లో చేసుకోవచ్చు. ఉద్యోగులు.. ఫామ్-16ను జూన్ 15లోపు అందుకుంటారు. వాళ్లు ఆదాయపు పన్ను ఫైలింగ్‌ను ఎంత త్వరగా పూర్తి చేస్తే అంత మంచిది!
ఉచితంగా ఆధార్ అప్డేట్.. మరికొన్ని రోజులే..
Free Aadhar Update : ఉచితంగా ఆధార్ కార్డు అప్డేట్ చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నట్లు ఇటీవలే యూఐడీఏఐ ట్వీట్ చేసింది. మై ఆధార్ పోర్టల్ ద్వారా ఎలాంటి ఛార్జీలు చెల్లించకుండానే అప్డేట్ చేసుకోవచ్చని తెలిపింది. జూన్ 14వ తేదీ వరకు మాత్రమే ఉచితంగా ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డు వివరాలను అప్డేట్ చేసుకోవచ్చు. ఈ గడువు ముగిసిన తర్వాత మళ్లీ యథాతథంగా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
-
Keep Demographic Details Updated to Strengthen Your #Aadhaar.
— Aadhaar (@UIDAI) March 16, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
If your Aadhaar had been issued 10 years ago & had never been updated - you may now upload Proof of Identity & Proof of Address documents online at https://t.co/CbzsDIBUbs ‘FREE OF COST’ from 15 March - June 14, 2023. pic.twitter.com/CFsKqPc2dm
">Keep Demographic Details Updated to Strengthen Your #Aadhaar.
— Aadhaar (@UIDAI) March 16, 2023
If your Aadhaar had been issued 10 years ago & had never been updated - you may now upload Proof of Identity & Proof of Address documents online at https://t.co/CbzsDIBUbs ‘FREE OF COST’ from 15 March - June 14, 2023. pic.twitter.com/CFsKqPc2dmKeep Demographic Details Updated to Strengthen Your #Aadhaar.
— Aadhaar (@UIDAI) March 16, 2023
If your Aadhaar had been issued 10 years ago & had never been updated - you may now upload Proof of Identity & Proof of Address documents online at https://t.co/CbzsDIBUbs ‘FREE OF COST’ from 15 March - June 14, 2023. pic.twitter.com/CFsKqPc2dm
ఈ-బైక్స్ ధరలకు రెక్కలు.. ఓలా స్కూటర్ మరింత ప్రియం!
Electric Bike Cost Hike In India : FAME-2 పథకం కింద ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు అందిస్తున్న సబ్సిడీలో భారీ కోత పెట్టబోతున్నట్లు కేంద్ర ఇటీవలే ప్రకటించింది. దీంతో వాటి ధరలు.. జూన్ ఒకటో తేదీ నుంచి పెరగనున్నాయి. సవరించిన సబ్సిడీ రేటు జూన్ 1 నుంచి రిజిస్ట్రేషన్ చేసుకునే అన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు వర్తిస్తుందని భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. (FAME-2) కింద వాహన తయారీదార్లకు కిలోవాట్ అవర్‌కు ప్రభుత్వం ఇస్తున్న రూ.15000 సబ్సిడీని రూ.10 వేలకు తగ్గించింది. ఈ-వాహనాల కొనుగోలుకు ఇచ్చే ప్రోత్సాహకాలకు ప్రస్తుతం వాహన వ్యయంలో ఉన్న 40 శాతం పరిమితిని 15 శాతానికి తగ్గించింది.
Ola S1 Cost : దేశంలో అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ స్కూటర్ Ola S1 ధరను 30 శాతం పెంచుతున్నట్లు ఆ కంపెనీ ప్రకటించింది. కేంద్రం ఇస్తున్న సబ్సిడీలో కోత విధిస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ధర పెంచుతున్నట్లు తెలిపింది. తాజా పెంపుతో Ola S1 ధర రూ. 1.30 లక్షలకు చేరింది. Ola S1 ప్రో ధర రూ. 1.25 లక్షల నుంచి రూ. 1.40 లక్షలకు పెరిగింది. ఇప్పుడు రెండు మోడళ్ల మధ్య తేడా రూ.10 వేల మాత్రమే. ఏథర్ ఎనర్జీ, బజాజ్ ఆటో, టీవీఎస్, హీరో మోటో కార్ప్, టార్క్ మోటర్స్ సహా ఇతర ప్రముఖ కంపెనీలు కూడా త్వరలోనే ఎలక్ట్రిక్ వాహనాల ధరల పెంచుతున్నట్లు ప్రకటించే అవకాశం ఉంది.
-
Looks cute. Rides like a beast.
— Ola Electric (@OlaElectric) May 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Get the S1 Pro before the price hike.
Click Here - https://t.co/mj9oDajMBU#EndICEage pic.twitter.com/TOm0eJN5hN
">Looks cute. Rides like a beast.
— Ola Electric (@OlaElectric) May 23, 2023
Get the S1 Pro before the price hike.
Click Here - https://t.co/mj9oDajMBU#EndICEage pic.twitter.com/TOm0eJN5hNLooks cute. Rides like a beast.
— Ola Electric (@OlaElectric) May 23, 2023
Get the S1 Pro before the price hike.
Click Here - https://t.co/mj9oDajMBU#EndICEage pic.twitter.com/TOm0eJN5hN
బ్యాంకు వినియోగదారులకు అలర్ట్
RBI 100 Days 100 Pays : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా '100 రోజులు 100 చెల్లింపులు' ప్రత్యేక కార్యక్రమం కూడా జూన్ 1నే ప్రారంభం కానుంది. బ్యాంకులు.. తమ ఖాతాదారులు క్లెయిమ్ చేయకుండా ఉండిపోయిన డిపాజిట్లను తగ్గించుకునేందుకు 100 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించేలా మే12న బ్యాంకులకు ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసింది. '100 రోజులు 100 చెల్లింపులు' కార్యక్రమం ద్వారా బ్యాంకులు తమ దగ్గర అన్‌క్లెయిమ్డ్‌గా ఉన్న టాప్–100 డిపాజిట్లను ఖాళీ చేయడంపై (తిరిగి చెల్లించడం/క్లియరెన్స్) దృష్టి పెడతాయని ఆర్‌బీఐ వెల్లడించింది. దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు ప్రతి జిల్లా పరిధిలో టాప్–100 అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్ల సంబంధీకులను గుర్తించి చెల్లింపులు చేసేందుకు చర్యలు చేపడతాయని ఆర్‌బీఐ పేర్కొంది.
-
Reserve Bank launches ‘100 Days 100 Pays’ Campaign for Return of Unclaimed Depositshttps://t.co/ixoVSZEcZv
— ReserveBankOfIndia (@RBI) May 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Reserve Bank launches ‘100 Days 100 Pays’ Campaign for Return of Unclaimed Depositshttps://t.co/ixoVSZEcZv
— ReserveBankOfIndia (@RBI) May 12, 2023Reserve Bank launches ‘100 Days 100 Pays’ Campaign for Return of Unclaimed Depositshttps://t.co/ixoVSZEcZv
— ReserveBankOfIndia (@RBI) May 12, 2023
LPG Cylinder Price : ప్రతి నెల ఒకటో తేదీన చమురు కంపెనీలు.. గ్యాస్ సిలిండర్ల ధరలను నిర్ణయిస్తాయి. గత నెల ఒకటో తేదీన వాణిజ్య సిలిండర్ ధరను చమురు కంపెనీలు రూ. 171.50 తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. అయితే జూన్ 1వ తేదీన కూడా గ్యాస్ ధరను సవరించే అవకాశాలు ఉన్నాయి.