ETV Bharat / business

కార్డు లేకుండానే నగదు ఉపసంహరణ.. ఇకపై అన్ని బ్యాంకుల్లో! - shaktikanta das live today

RBI Cardless Transactions: ఏటీఎంల నుంచి నగదు ఉపసహంరణపై రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. కార్డు లేకుండానే అన్ని ఏటీఎంలు, బ్యాంకుల నుంచి నగదు ఉపసంహరించుకునేలా కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానుంది.

RBI Cardless Transactions
కార్డు లేకుండానేే నగదు ఉపసంహరణ.. ఇక నుంచి అన్ని బ్యాంకుల్లో!
author img

By

Published : Apr 8, 2022, 4:27 PM IST

Updated : Apr 8, 2022, 5:51 PM IST

RBI Cardless Transactions: బ్యాంకు మోసాలను అరికట్టేందుకు రిజర్వ్ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. కార్డు లేకుండానే ఏటీఎం నుంచి నగదును ఉపసంహరించుకునేలా.. అన్ని బ్యాంకులను అనుమతించాలని ప్రతిపాదించింది. ప్రస్తుతం కార్డు రహిత నగదు ఉపసంహరణ కొన్ని బ్యాంకుల్లోనే అందుబాటులో ఉంది. ఇకనుంచి అన్ని బ్యాంకుల్లో, ఏటీఎం నెట్​వర్క్​ల్లో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తేవాలని ఆర్బీఐ నిర్ణయించింది.

ఈ నిర్ణయంతో సులభతర లావాదేవీలతో పాటు.. కార్డు లేకపోవడం వల్ల క్లోనింగ్​, స్కిమ్మింగ్ వంటి మోసాలు తగ్గుతాయని ఆర్బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్​ అన్నారు. దీని కోసం యూనిఫైడ్​ పేమెంట్స్​ ఇంటర్​ఫేస్​ను ఉపయోగిస్తామని ఆయన వెల్లడించారు. ఈ మేరకు ఏటీఎం నెట్‌వర్క్‌లు, బ్యాంకులకు త్వరలోనే మార్గదర్శకాలు జారీచేయనున్నట్లు తెలిపారు. నాన్‌ బ్యాకింగ్ ఆపరేటింగ్ యూనిట్స్‌లో కూడా భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్‌(BBPS)ను ప్రోత్సహించనున్నట్లు ఆర్బీఐ గవర్నర్‌ వెల్లడించారు. ఇందుకు అవసరమైన సవరణలు చేయనున్నట్లు చెప్పారు. డిజిటల్​ పేమెంట్​ మోడ్​ను అభివృద్ధి చేయడంతో పాటు సైబర్​ మోసాలు జరగకుండా చూడాలన్నారు. సైబర్​ భద్రతపై త్వరలోనే మార్గదర్శకాలు జారీ చేస్తామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: పాత మొబైల్​ బ్యాటరీతో ఆట.. పాపం ఎనిమిదేళ్ల బాలుడు...

Last Updated : Apr 8, 2022, 5:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.