స్టాక్‌మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ- సెన్సెక్స్ (Sensex today) 139 పాయింట్లు పెరిగి 52,976 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ (Nifty today) 32 పాయింట్లు వృద్ధి చెంది.. 15,856 వద్దకు చేరింది.
ఆర్థిక, ఫార్మా, ఐటీ షేర్లు లాభాలను ఆర్జించాయి. విద్యుత్ షేర్లు నష్టాలను చవిచూశాయి.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 53,114 పాయింట్ల అత్యధిక స్థాయి, 52,653 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 15,899 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 15,768 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
- ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ షేర్లు లాభాలను గడించాయి.
- ఎల్ అండ్ టీ, ఏషియన్ పెయింట్స్, ఎన్టీపీసీ, రిలయన్స్, హిందుస్థాన్ యూనిలివర్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.
రూ.లక్ష కోట్లు దాటిన జొమాటో విలువ..
స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదైన తొలిరోజే జొమాటో షేర్లు దుమ్మురేపాయి. సంస్థ షేర్లు ఓ దశలో రూ.138కు చేరి అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. దీంతో సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.లక్ష కోట్లు దాటింది. బీఎస్ఈలో అత్యధిక విలువ కలిగిన తొలి 50 కంపెనీల సరసన జొమాటో చేరింది. చివరగా ఈ రోజు సెషన్లో సంస్థ షేర్ విలువ రూ.125.20 వద్ద స్థిరపడింది.
ఇదీ చదవండి: వృద్ధి రేటు: భారత్‌కు కోత- చైనాకు యథాతథం!