వారాంతంలో లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరి సెషన్లో భారీ నష్టాల్లోకి వెళ్లాయి. ఫార్మా, లోహ రంగాల్లో అమ్మకాలు పెరగగా.. బ్యాంకింగ్, వాహన రంగాల షేర్లు 2 శాతం మేర పడిపోయాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ-సెన్సెక్స్ 433 పాయింట్ల నష్టంతో 37,877కి పడిపోయింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ- నిఫ్టీ 122 పాయింట్లు కోల్పోయి 11,178 పాయింట్ల వద్ద స్థిరపడింది.
లాభ నష్టాల్లో..
ఎన్టీపీసీ, సన్‌ఫార్మా, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, టైటాన్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, మహీంద్రా అండ్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ, హెచ్డీఎఫ్సీ, మారుతి, బజాజ్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.