ETV Bharat / business

మార్కెట్లపై కరోనా దెబ్బ- సెన్సెక్స్ 871 డౌన్

కరోనా భయాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్‌ 871 పాయింట్లకు పైగా కోల్పోయి 49,159 వద్దకు చేరుకుంది. ఎన్​ఎస్​ఈ- నిఫ్టీ 230 పాయింట్లకు పైగా నష్టపోయి 14,638వద్ద ముగిసింది.

WITH RISING CORONA CASES THE STOCK MARKETS ARE HEADING TOWARDS HUGE LOSSES
కరోనా భయాలతో కుప్పకూలిన స్టాక్​మార్కెట్లు
author img

By

Published : Apr 5, 2021, 3:39 PM IST

స్టాక్​ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ముగిశాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ 871 పాయింట్లు క్షీణించి 49,159 వద్దకు చేరింది. ఎన్​ఎస్​ఈ- నిఫ్టీ 230 పాయింట్ల నష్టంతో 14,638 వద్ద స్థిరపడింది.

దేశవ్యాప్తంగా కొవిడ్​ విజృంభణతో ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. మరోసారి లాక్​డౌన్​ విధించవచ్చన్న అంచనాలతో మదుపరులు అమ్మకాలకు మొగ్గు చూపారు. ఈ క్రమంలో మార్కెట్లు భారీ నష్టాలను చవి చూశాయి. ఒకానొక సమయంలో సెన్సెక్స్​ 1449 పాయింట్లు పతనమైంది.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ 50,028 పాయింట్ల అత్యధిక స్థాయి, 48,580 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 14,849 పాయింట్ల గరిష్ఠ స్థాయి 14,459 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

హెచ్​సీఎల్​ టెక్​, టీసీఎస్​, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్​టెల్​, టెక్​ మహీంద్ర షేర్లు లాభాలను నమోదు చేశాయి.

బజాజ్​ ఫినాన్స్​, ఇండస్​ఇండ్​ బ్యాంక్, ఎస్​బీఐ, ఎం అండ్​ ఎం, బజాజ్​ ఆటో, యాక్సిస్​ బ్యాంక్​, ఐసీఐసీఐ బ్యాంక్​, ఐటీసీ, కోటక్​ మహీంద్ర బ్యాంక్​ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.