కరోనా భయాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా కోల్పోయి 49,009 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ- నిఫ్టీ 280 పాయింట్లకు పైగా నష్టపోయి 14,580 వద్ద ట్రేడవుతోంది. ఈ స్థాయి నష్టాలకు కారణాలు ఇలా ఉన్నాయి.
- దేశీయంగా కరోనా కేసులు భారీస్థాయిలో వెలుగు చూడడం. మదుపరులను ఆందోళనకు గురిచేస్తోంది.
- దేశవ్యాప్తంగా కొవిడ్ విజృంభణతో ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. మరోసారి లాక్డౌన్ పెట్టొచ్చన్న అంచనాలతో మదుపరులు అమ్మకాలకు మొగ్గు చూపుతున్నారు.
- దేశ జీడీపీలో 13 శాతం వాటా ఉన్న మహారాష్ట్రలో వారాంతాల్లో లాక్డౌన్ విధించడం స్వదేశీ సంస్థాగత మదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.అంతర్జాతీయంగా కూడా పెరుగుతోన్న కరోనా కేసులు విదేశీ సంస్థాగత మదుపరులను వెనకడుగు వేసేలా చేశాయి.
- మార్కెట్లకు ఊతం ఇచ్చే అంశం ఒక్కటి కూడా లేకపోవడం నష్టాలకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు.
- ఆర్బీఐ ఎంపీసీ సమీక్షకు సంబంధించి సానుకూల అంచనాలు లేకపోవడం కూడా నష్టాలకు మరో కారణంగా తెలుస్తోంది.
- నెలవారీ సేవా రంగ పీఎంఐ మళ్లీ తగ్గితే.. మార్కెట్ మరింత పడిపోయే ప్రమాదం ఉందని నిపుణుల అంచనా.
- భారీ నష్టాలతో బీఎస్ఈ మదుపరుల సంపద (మిడ్ సెషన్ ముందు వరకు) రూ.4.54 లక్షల కోట్లు ఆవిరైంది.
- ప్రస్తుత సెషన్లో సెన్సెక్స్ అత్యధికంగా 1449 పాయింట్లు పతనమవడం కొసమెరుపు
ఇదీ చూడండి: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు- సెన్సెక్స్ 1350 మైనస్