ETV Bharat / business

ఏంటీ బిట్​కాయిన్? భారత్​లో పెట్టుబడి పెట్టొచ్చా? - బిట్​కాయిన్​పై పెట్టుబడులు పెట్టొచ్చా

బిట్​కాయిన్ విలువ రోజురోజుకూ పెరుగుతూ ఆకాశాన్ని తాకుతోంది. ఈ వారమే దీని విలువ జీవితకాల గరిష్ఠానికి చేరుకుంది. పదేళ్ల కాలానికి బెస్ట్ పెర్ఫార్మింగ్ అసెట్​గా నిలిచింది. మరి ఇలాంటి కామధేను లాంటి క్రిప్టోకరెన్సీపై పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వార్త మీకోసమే.

Want to invest in Bitcoin? Here's what you should know
బిట్​కాయిన్లపై భారత్​లో పెట్టుబడి పెట్టొచ్చా?
author img

By

Published : Dec 6, 2020, 4:04 PM IST

బిట్​కాయిన్ ధరలకు రెక్కలొస్తున్నాయి. బిట్​కాయిన్ విలువ ఈ వారం జీవితకాల గరిష్ఠానికి చేరింది. 20 వేల డాలర్ల మార్క్​కు చేరువైంది. 2020 సంవత్సరంలో ఏకంగా 170 శాతం పెరిగింది.

సంస్థాగత మదుపరులు డిజిటల్ కరెన్సీ పట్ల మొగ్గుచూపడం ఈ పెరుగుదలకు ఓ కారణంగా కనిపిస్తోంది. రిటర్నులు అధికంగా ఉండటం వల్ల భారత్​లోని రిటైల్ ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఈ కరెన్సీలు. ఫలితంగా దేశంలోని బిట్​కాయిన్ కరెన్సీ ఎక్స్ఛేంజీల వ్యాపార పరిణామం భారీగా పెరిగింది.

ఒకవేళ మీరూ బిట్​కాయిన్లపై పెట్టుబడి పెట్టాలని ఉన్నా.. పూర్తి అవగాహన లేదని ఆలోచిస్తున్నారా? మీకు పూర్తి వివరాలు అందించేందుకు, మీ అనుమానాలను పరిష్కరించేందుకు బిట్​కాయిన్​ నిపుణులు, మెయిన్​చైన్ రీసెర్చ్ అండ్ కన్సల్టింగ్ సహ వ్యవస్థాపకులు శిఖా మెహ్రాను ఈటీవీ భారత్ సంప్రదించింది. వారు ఇచ్చిన సమధానాలు మీకోసం.

ముందుగా బిట్​కాయిన్ అంటే ఏంటి?

బిట్​కాయిన్ అనేది తొలి క్రిప్టోకరెన్సీ పేరు. 2009లో దీన్ని రూపొందించారు. ఈ కరెన్సీ భౌతిక రూపంలో ఉండదు. ప్రతిదీ డిజిటల్​గానే జరుగుతుంది. బ్లాక్​చైన్ సాంకేతికతపై బిట్​కాయిన్ విలువ ఆధారపడి ఉంటుంది.

ఇండియాలో బిట్​కాయిన్​లపై పెట్టుబడులు పెట్టడం చట్టబద్ధమేనా?

క్లుప్తంగా చెప్పాలంటే.. చట్టబద్ధమే. బిట్​కాయిన్ ట్రేడింగ్​పై భారత్​లో నిషేధం లేదు. కానీ క్రిప్టోకరెన్సీని నియంత్రించేందుకు ఎలాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ లేదు. క్రిప్టోకరెన్సీ నియంత్రణకు విధివిధానాలు రూపొందించాలని 2019 ఫిబ్రవరి 25న కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదు.

కాబట్టి, క్రిప్టోకరెన్సీలపై ట్రేడింగ్ చేసేటప్పుడు ఎలాంటి చట్టాలు అతిక్రమించకుండా ఉండటం ముఖ్యం. ఎలాంటి నిబంధనలు, మార్గదర్శకాలు లేవు కాబట్టి ఏదైనా వివాదాలు తలెత్తితే.. ప్రభుత్వం నుంచి సహాయం లభించదు.

భారత్​లో బిట్​కాయిన్ కొనుగోలు, అమ్మకాలు ఎలా?

బిట్​కాయిన్ల కొనుగోలు/అమ్మకానికి భారత్​లో పలు ఎక్స్ఛేంజీలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో వాజిర్ ఎక్స్, కాయిన్​స్విచ్, జెబ్​పే, కాయిన్​డీసీఎక్స్​ ముఖ్యమైనవి. ఈ ఎక్స్ఛేంజీల్లో ట్రేడింగ్ ఖాతా తీసిన తర్వాత క్రిప్టోకరెన్సీలపై పెట్టుబడులు పెట్టొచ్చు.

ఈ ఎక్స్ఛేంజీలను ప్రభుత్వం నియంత్రిస్తుందా?

భారత్​లోని క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజీలు ఏ ప్రభుత్వ నియంత్రణ ఫ్రేమ్​వర్క్ కిందకు రావు. భారత్​లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు వీటికి లైసెన్సులు సైతం అవసరం లేదు. ప్రస్తుతం ఇవన్నీ స్వీయ-నియంత్రణ సంస్థ(ఎస్ఆర్ఓ) ఫ్రేమ్​వర్క్​ అనుగుణంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి.

బిట్​కాయిన్ ట్రేడింగ్ అకౌంట్ తెరిచేందుకు ఏ పత్రాలను సమర్పించాలి?

చట్టబద్ధమైన క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజీలన్నీ దాదాపుగా ఒకే తరహా సమాచారాన్ని సేకరిస్తాయి. బ్యాంక్ ఖాతా, కేవైసీ వివరాలతో పాటు మొబైల్ నెంబర్​తో బిట్​కాయిన్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. కేవైసీ వెరిఫికేషన్ కోసం ఆధార్ లేదా పాన్​ కార్డులలో ఏదైనా ఉపయోగించుకోవచ్చు. రిజిస్టర్డ్ బ్యాంక్ ఖాతా నుంచి నగదును ట్రేడింగ్ అకౌంట్​కు బదిలీ చేసుకోవచ్చు.

బిట్​కాయిన్ పెట్టుబడి లాభాలపై పన్ను ఎంత చెల్లించాలి?

ఇన్వెస్టర్​లైతే.. భారత్​లో తమ బిట్​కాయిన్ పెట్టుబడి లాభాలపై క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ చెల్లించాలి. ఒకవేళ బిట్​కాయిన్ అమ్మకం, కొనుగోళ్లే ప్రధాన కార్యకలాపాలై ఉంటే.. వ్యాపారాలపై విధించే పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజీలు పన్ను అధికారులతో వివరాలను పంచుకుంటాయా?

క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజీల వద్ద కస్టమర్ల వివరాలు, కొనుగోళ్లు-అమ్మకాల రికార్డులన్నీ ఉంటాయి. ఒకవేళ పన్ను అధికారులు వీటిని తమతో పంచుకోవాలని కోరితే.. ఈ సమాచారం ఇస్తారు. దీనర్థం బిట్​కాయిన్​పై పెట్టుబడులు పెట్టే వారి సమాచారం ఆదాయ పన్ను శాఖ వద్ద ఉండే అవకాశం ఉంది.

బిట్​కాయిన్ విలువ ఎందుకు అంతగా పెరుగుతోంది?

గత పదేళ్ల వ్యవధిలో బిట్​కాయిన్ బెస్ట్ పెర్ఫార్మింగ్ అసెట్​గా నిలిచింది. ఇన్వెస్టర్లు దీన్ని ద్రవ్యోల్బణం నుంచి రక్షణగా భావిస్తున్నారు. చాలా కార్పొరేట్ సంస్థలు, సంస్థాగత పెట్టుబడిదారులు క్రిప్టోకరెన్సీలపై దృష్టిసారిస్తున్నారు. ఇన్వెస్ట్​మెంట్ పోర్ట్​ఫోలియోను వైవిధ్యంగా మార్చుకోవడం కోసం బిట్​కాయిన్లపై అధికంగా పెట్టుబడులు పెడుతున్నారు.

బిట్​కాయిన్ విలువ అస్థిరంగా ఉండటానికి కారణం?

బిట్​కాయిన్ మార్కెట్ ఇతర మార్కెట్లతో పోలిస్తే చాలా చిన్నది. ఉదహరణకు లార్జ్​ క్యాప్ షేర్లతో పోలిస్తే.. చిన్న, మధ్య తరహా షేర్లు ఎక్కువ ఒడుదొడుకులకు లోనవుతాయి. ఇదే బిట్​కాయిన్లకూ వర్తిస్తుంది. ప్రస్తుతం ఏ చిన్న వార్తైనా బిట్​కాయిన్ ధరలపై ప్రభావం చూపుతోంది. ఒక్కసారి మార్కెట్ స్థాయి, వర్తక పరిణామం పెరిగితే ఈ సమస్య ఉండదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.