స్టాక్ మార్కెట్లు సోమవారం ఒడుదొడుకులతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలు ఒడుదొడుకులకు కారణంగా తెలుస్తోంది. బీఎస్ఈ-సెన్సెక్స్ 420 పాయింట్లకుపైగా కోల్పోయి 52,052 వద్ద ట్రేడవుతోంది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 150 పాయింట్లకుపైగా నష్టంతో 15,644 వద్ద కొనసాగుతోంది.
- ఇన్ఫోసిస్, టీసీఎస్, రిలయన్స్ మినహా.. 30 షేర్ల ఇండెక్స్‌లో అన్ని కంపెనీలు నష్టాల్లోనే ఉన్నాయి.
- బజాజ్ ఫినాన్స్, ఎన్టీపీసీ, డాక్టర్ రెడ్డీస్, ఎస్బీఐ, టెక్ మహీంద్రా షేర్లు ప్రధానంగా నష్టాల్లో ఉన్నాయి.