నిఫ్టీ 37 ప్లస్..
స్టాక్ మార్కెట్లు వరుసగా ఆరో రోజూ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 181 పాయింట్లు బలపడి జీవనకాల గరిష్ఠమైన 45,608 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 37 పాయింట్లు పెరిగి సరికొత్త జీవనకాల రికార్డు స్థాయి అయిన 13,393 వద్దకు చేరింది.
ఐటీ, హెవీ వెయిట్ షేర్లు లాభాలకు దన్నుగా నిలిచాయి.
- అల్ట్రాటెక్ సిమెంట్, టీసీఎస్, రిలయన్స్, హెచ్‌సీఎల్‌టెక్, ఇన్ఫోసిస్, ఎస్బీఐ షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.
- సన్‌ఫార్మా, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎన్టీపీసీ, టెక్ మహీంద్రా, ఓఎన్జీసీ, ఏషియన్ పెయింట్స్ నష్టాలను మూటగట్టుకున్నాయి.