అంతర్జాతీయ సానుకూలతలు, బ్యాంకింగ్ రంగ షేర్ల దూకుడుతో దేశీయ మార్కెట్లు లాభాల్లో సాగుతున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్ 332 పాయింట్లు మెరుగుపడి 38 వేల 514 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- నిఫ్టీ 85 పాయింట్లు లాభపడి 11 వేల 356 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.
లాభనష్టాల్లో...
ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎల్ అండ్ టీ, పవర్‌గ్రిడ్, ఐటీసీ, కోటక్ బ్యాంక్, మారుతి, టాటా స్టీల్, హెచ్డీఎఫ్సీ లాభాల్లో ఉన్నాయి.
భారతీ ఎయిర్టెల్, టైటాన్, సిప్లా నష్టాల్లో ట్రేడవుతున్నాయి.