ఆర్థిక మాంద్యం భయాలతో గత సెషన్లో భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు అదే స్థాయిలో తిరిగి పుంజుకున్నాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 424.50 పాయింట్లు ఎగబాకి మళ్లీ 38 వేల మార్కును దాటింది. మార్కెట్లు ముగిసే సమయానికి 38,233.41 పాయింట్ల వద్ద స్థిరపడింది.
జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 129 పాయింట్ల లాభంతో 11,483.25 వద్ద ముగిసింది.
ఇదీ కారణం
ఇతర ఆసియా మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల పవనాలతో దేశీయ మార్కెట్లు పుంజుకున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, చమురు రంగాల్లో భారీగా కొనుగోళ్లు పెరిగాయి. దీంతో మార్కెట్లు భారీ లాభాలను నమోదు చేశాయి.
ఇంట్రాడే సాగిందిలా..
సూచీ | గరిష్ఠం | కనిష్ఠం |
సెన్సెక్స్ | 38,297.70 | 37,800.08 |
నిఫ్టీ | 11,496.75 | 11,352.45 |
లాభానష్టాల్లోనివివే...
నేటి ట్రేడింగ్‌లో ఎస్బీఐ 3.23 శాతం లాభాలతో జాబితాలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఎన్టీపీసీ 3.21 శాతం, వేదాంత 3.18 రిలయన్స్ ఇండస్ట్రీస్ 3.16 శాతం, ఐసీఐసీఐ బ్యాంకు 2.75 శాతం, బజాజ్ ఫినాన్స్ 2.72 శాతం మేర లాభాలను నమోదు చేశాయి.
ఇన్ఫోసిస్ అత్యధికంగా 1.30 శాతం నష్టపోయింది. ఈ వరుసలో బజాజ్ ఆటో 0.85 శాతం, ఐటీసీ 0.68 శాతం, లార్సెన్ టూబ్రో 0.37 శాతం, కోల్ ఇండియా 0.34 శాతం మేర నష్టపోయాయి.
30 షేర్ల ఇండెక్స్‌లో 23 షేర్లు లాభాల్లో ముగియగా 7 షేర్లు నష్టాలను నమోదు చేశాయి.