కరోనా మహమ్మారి విజృంభణతో స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 471 పాయింట్లు నష్టపోయి 48,691 వద్ద సెషన్‌ను ముగించింది. నిఫ్టీ 154 పాయింట్లు కోల్పోయి 14,697 వద్ద స్థిరపడింది.
దాదాపు అన్ని రాష్ట్రాల్లో లాక్డౌన్ తరహా ఆంక్షలు అమల్లోకి రావడం, ఎన్నాళ్లుంటుందో తెలియని కరోనా ప్రభావంతో ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి జారుకుంటుందనే భయాలు మదుపర్లను వెంటాడాయి. ఫలితంగా సూచీలు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 49,171 పాయింట్ల అత్యధిక స్థాయిని, 48,551 పాయింట్ల అత్యల్ప స్థాయిని నమోదు చేసింది.
నిఫ్టీ 14,824 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 14,650 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివివే..
30షేర్ల ఇండెక్స్‌లో టైటాన్, పవర్‌గ్రిడ్, మారుతీ, ఎస్బీఐ, ఎన్టీపీసీ, ఎల్ అండ్ టీ, డాక్టర్ రెడ్డీస్, హెచ్‌సీఎల్ టెక్, ఏషియన్ పెయింట్స్, మినహా.. ఇతర షేర్లన్నీ భారీగా నష్టాల్లో సెషన్‌ను ముగించాయి.