భారీ ఒడుదొడుకుల నడుమ స్టాక్ మార్కెట్లు బుధవారం ఫ్లాట్గా ముగిశాయి. బీఎస్ఈ- సెన్సెక్స్ 25 పాయింట్లు కోల్పోయి.. చివరకు 49,492 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ అతి స్వల్పంగా ఒక పాయింటు పెరిగి 14,565 వద్ద ఫ్లాట్గా ముగిసింది.
ఇంట్రాడేలో సెన్సెక్స్ 49,795 పాయింట్ల గరిష్ఠాన్ని (జీవనకాల గరిష్ఠం), 49,073 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది. నిఫ్టీ 14,653 పాయింట్ల అత్యధిక స్థాయి (కొత్త రికార్డు), 14,435 పాయింట్ల అత్యల్ప స్థాయిల మధ్య కదలాడింది.
ఎం&ఎం, ఎస్బీఐ, ఐటీసీ, ఎన్టీపీసీ, భారతీ ఎయిర్టెల్, ఓఎన్జీసీ, లాభాలను నమోదు చేశాయి.
బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫిన్సర్వ్, , డాక్టర్ రెడ్డీస్, ఏషియన్ పెయింట్స్, కోటక్ బ్యాంకు నష్టాల్లో ట్రేడయ్యాయి.