ETV Bharat / business

వెంటాడిన ఒమిక్రాన్, చమురు భయాలు.. సెన్సెక్స్ 634 పాయింట్లు డౌన్

Stock market news: స్టాక్​ మార్కెట్లు మూడో రోజూ భారీ నష్టాలతో ముగిశాయి. ద్రవ్యోల్బణ భయాలు, ఫెడ్​ వడ్డీ రేట్లు పెరుగుతాయనే ఆందోళనలు మదుపర్ల సెంటిమెంట్​ను తీవ్రంగా ప్రభావితం చేశాయి. దీంతో సెన్సెక్స్​ 600 పాయింట్లకు పైగా.. నిఫ్టీ 180 పాయింట్లకు పైగా పతనమయ్యాయి.

stock market news
స్టాక్​ మార్కెట్​ న్యూస్​
author img

By

Published : Jan 20, 2022, 3:39 PM IST

Updated : Jan 20, 2022, 3:49 PM IST

Stock market news: బేర్​ పంజాతో స్టాక్​ మార్కెట్లు వరుసగా మూడో రోజు భారీ నష్టాలను చవిచూశాయి. మూడు సెషన్లలోనే సెన్సెక్స్​ 2000 పాయింట్లకుపైగా నష్టపోయింది. మదుపర్ల రూ.లక్షల కోట్ల సంపద ఆవిరైంది. గురువారం సెషన్​లో అంతర్జాతీయంగా మిశ్రమ పవనాలు, ద్రవ్యోల్బణ భయాలు మదుపర్ల సెంటిమెంట్​ను తీవ్రంగా ప్రభావితం చేశాయి. దీంతో ఒకానొక దశలో దాదాపు 1000 పాయింట్లు పతనమైన సెన్సెక్స్​ చివర్లో కాస్త కోలుకుంది. 634 పాయింట్లు నష్టపోయి 60వేల దిగువన 59,464 వద్ద ముగిసింది. నిఫ్టీ 181 పాయింట్లు కోల్పోయి 17,757కు దిగొచ్చింది.

కారణాలివే...

  • అంతర్జాతీయ విపణుల నుంచి మిశ్రమ పవనాలు స్టాక్​ మార్కెట్ల పతనానికి కారణమయ్యాయి. ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో పెరిగే సూచనలు కన్పిస్తుండటం, ఫెడ్ వడ్డీ రేట్లు కూడా పెరుగుతాయనే భయాందోళనల నడుమ మదుపర్లకు అమ్మకాలకు మొగ్గు చూపారు.
  • ముడి చుమురు ధరలు ఏడు సంవత్సారాల గరిష్ఠానికి చేరడం కూడా మదుపర్లపై ప్రతికూల ప్రభావం చూపింది. అంతర్జాతీయ మార్కెట్​లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పటికీ భారత్​లో పెట్రోల్, డీజిల్ స్థిరంగా ఉన్నాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల అనంతరం చమురు ధరలు పెరిగే అవకాశముందనే భయాలు సూచీల పతనానికి మరో కారణం.
  • దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి తర్వాత కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతుండటం కూడా మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది. కేసుల సంఖ్య గురువారం మూడు లక్షలు దాటడం మదుపర్లను ప్రభావితం చేసింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

  • బజాజ్​ ఫిన్​సర్వ్, బజాజ్​ ఆటో, దివిస్ ల్యాబ్స్​, సన్​ ఫార్మా, ఇన్ఫోసిస్ షేర్లు నష్టాల్లో ముగిశాయి.
  • పవర్ గ్రిడ్ కార్ప్, భారతీ ఎయిర్​టెల్, గ్రాసిమ్, జేఎస్​డ్బ్లూ స్టీల్, బ్రిటానియా షేర్లు లాభాలు గడించాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి: ఉద్యోగం మారేందుకే 82 శాతం మొగ్గు.. అదే కారణం!

Last Updated : Jan 20, 2022, 3:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.