ఆరంభంలో దూసుకెళ్లినా.. చివరికి నష్టాలే..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మళ్లీ నష్టాలు నమోదుచేశాయి. ఆరంభంలో దూసుకెళ్లినా.. ఆఖర్లో కుదేలయ్యాయి. ఓ దశలో 420 పాయింట్లకుపైగా పెరిగిన సెన్సెక్స్.. మళ్లీ 420 పాయింట్లు నష్టాన్నీ నమోదుచేసింది. చివరకు 304 పాయింట్లు కోల్పోయి.. 57 వేల 685 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 70 పాయింట్ల పతనంతో.. 17 వేల 246 వద్ద సెషన్‌ను ముగించింది. హిందాల్కో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, దివీస్ ల్యాబ్స్, టాటా స్టీల్, యూపీఎల్ రాణించగా.. హెచ్డీఎఫ్సీ, కోటక్ మహీంద్రా, భారతీ ఎయిర్టెల్, బ్రిటానియా, సిప్లా డీలాపడ్డాయి.