స్టాక్ మార్కెట్లలో అనిశ్చితి కొనసాగుతోంది. సూచీలు ఒడుదొడుకుల మధ్యే ట్రేడింగ్ సాగిస్తున్నాయి. లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్.. క్రమంగా నష్టాల్లోకి మళ్లింది. ప్రస్తుతం 120 పాయింట్లు కోల్పోయి.. 58 వేల మార్క్ దిగువన ట్రేడవుతోంది.
నిఫ్టీ సైతం నష్టాల్లోనే ఉంది. 15 పాయింట్లు పడిపోయి.. 17,306 వద్ద కదలాడుతోంది.
ఆసియా మార్కెట్లు సైతం ఒడుదొడుకుల్లోనే ఉన్నాయి. ఉక్రెయిన్పై దాడి చేయాలన్న ప్రణాళికలను రష్యా విరమించుకోలేదని అమెరికా చేసిన ప్రకటనతో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
మరోవైపు, క్రూడ్ ఆయిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం బ్యారెల్ ముడిచమురు ధర 93.99 డాలర్లు పలుకుతోంది.
బుధవారం విదేశీ సంస్థాగత మదుపర్లు మూకుమ్మడిగా విక్రయాలకు దిగారు. రూ.1890.96 కోట్ల షేర్లను వారు విక్రయించినట్లు స్టాక్ ఎక్స్ఛేంజీ గణాంకాలు చెబుతున్నాయి.