ETV Bharat / business

లాభాల్లో దేశీయ సూచీలు.. సెన్సెక్స్​ 400 ప్లస్​ - స్టాక్​ మార్కెట్​ న్యూస్​

Stock Market Live Updates
స్టాక్​ మార్కెట్​ లైవ్ అప్డేట్స్
author img

By

Published : Feb 9, 2022, 9:20 AM IST

Updated : Feb 9, 2022, 10:54 AM IST

10:30 February 09

లాభాల్లో మార్కెట్లు..

స్టాక్​ మార్కెట్లు లాభాల్లో కదలాడుతున్నాయి. బీఎస్​ఈ సెన్సెక్స్ 422 పాయింట్లకు పైగా బలపడి 58,230 వద్ద ట్రేడవుతుంది. మరో సూచీ నిప్టీ 130 పాయింట్ల లాభంతో 17,396 వద్ద కొనసాగుతోంది.

అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగియడం సహా టెక్‌ స్టాక్‌లు తిరిగి కోలుకున్నాయి. ఆసియా మార్కెట్లు కూడా నేడు లాభాల్లో పయనిస్తున్నాయి. దీంతో మదుపరులు కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు.

మరోవైపు గురువారం ఆర్‌బీఐ పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమీక్ష నిర్ణయాలు వెలువడనున్నాయి. అలాగే అమెరికాలో రిటైల్‌ ద్రవ్యోల్బణ గణాంకాలు రానున్నాయి. ఈ రెండు ప్రధాన పరిణామాలపైన మదుపర్లు దృష్టి సారించే అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. మరోవైపు గురువారం వీక్లీ ఆప్షన్స్‌ ఎక్స్‌పైరీ కూడా నేడు సూచీలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

లాభనష్టాలు..

ఇండస్​ ఇండ్​ బ్యాంక్​, మారుతీ, హెచ్​సీఎల్​ టెక్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, బజాజ్​ ఫిన్​సర్వ్​, టెక్​ మహీంద్ర షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

పవర్​గ్రిడ్​, సన్​ఫార్మా, ఎస్​బీఐ, టాటా స్టీల్​ షేర్లు నష్టాల్లో ట్రేడ్​ అవుతున్నాయి.

08:54 February 09

స్టాక్ మార్కెట్​ లైవ్​ అప్​డేట్స్​

Stock market live updates: స్టాక్​ మార్కెట్లు బుధవారం తొలి సెషన్​ను లాభాలతో ప్రారంభించాయి. అంతర్జాతీయ సానుకూలతల నేపథ్యంలో సెన్సెక్స్​ 400 పాయింట్లు వృద్ధి చెంది 58,208 కి చేరింది. నిఫ్టీ 118 పాయింట్లు మెరుగుపడి 17,384 వద్ద ట్రేడవుతోంది.

లాభనష్టాలు..

టెక్​ మహీంద్రా, బజాజ్​ ఫిన్​సర్వ్​, కోటక్​ మహీంద్రా బ్యాంక్​, హెచ్​డీఎఫ్​సీ, టాటా స్టీల్​ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

సన్​ఫార్మా, హిందుస్థాన్​ యూనిలివర్​, పవర్​ గ్రిడ్​ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

Last Updated : Feb 9, 2022, 10:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.