స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ (Sensex today) 126 పాయింట్లు తగ్గి 59,015 వద్ద స్థిరపడింది. నిఫ్టీ (Nifty today) 44 పాయింట్ల నష్టంతో 17,585 వద్దకు చేరింది.
- కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, మారుతీ సుజుకీ, యాక్సిస్ బ్యాంక్ ప్రధానంగా లాభాలను గడించాయి.
- టాటా స్టీల్, ఎస్బీఐ, టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, సన్ ఫార్మా నష్టాలను మూటగట్టుకున్నాయి.
ఇతర మార్కెట్లు
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో.. షాంఘై (చైనా), నిక్కీ (జపాన్), కోస్పీ (దక్షిణ కొరియా), హాంగ్‌సెంగ్ (హాంకాంగ్) సూచీలు లాభాలను గడించాయి. చివరి సెషన్లో ఈ సూచీలన్నీ నష్టాలను మూటగట్టుకోవడం గమనార్హం.