స్టాక్ మార్కెట్లు బుధవారం ఒడుదొడుకులతో ప్రారంభమై.. ప్రస్తుతం స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 70 పాయింట్లకుపైగా పెరిగి.. 52,262 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ దాదాపు 30 పాయింట్ల లాభంతో 15,767 వద్ద కొనసాగుతోంది.
- ఓఎన్జీసీ, సన్‌ఫార్మా, ఎన్టీపీసీ, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్డీఎఫ్సీ లాభాల్లో ఉన్నాయి.
- అల్ట్రాటెక్ సిమెంట్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.