అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పవనాలకు తోడు పెద్ద ఎత్తున కొనుగోళ్లు వెల్లువెత్తగా స్టాక్‌మార్కెట్లు మంగళవారం భారీ లాభాలను నమోదు చేశాయి. ఒమిక్రాన్ భయాలు ఉన్నప్పటికీ.. బుధవారం వెలువడనున్న ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష ఫలితాలు సానుకూలంగానే ఉంటాయనే సూచనలు మదుపరుల ఆశలకు ప్రాణం పోశాయి. దీంతో అన్ని రంగాల షేర్లు పెరిగాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 887 పాయింట్లు లాభంతో 57,634పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 264 పాయింట్ల వృద్ధితో 17,177 వద్ద ముగిసింది.
ముప్పై షేర్ల ఇండెక్స్‌లో... ఏషియన్ పెయింట్స్ ఒక్కటే నష్టాల్లో ముగిసింది.