లాభాల్లో సూచీలు-15వేల మార్కును తాకిన నిఫ్టీ
భారీ ఒడుదొడుకుల నుంచి కోలుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో పయనిస్తున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ-సెన్సెక్స్ 411 పాయింట్లకు పైగా పుంజుకుంది. ప్రస్తుతం 50,806 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్సేంజీ-నిఫ్టీ 108పాయింట్ల లాభంతో 15,038 వద్ద ట్రేడవుతోంది.
లాభనష్టాల్లో..
టైటాన్, బజాజ్ ఫినాన్స్, హెచ్డీఎఫ్సీ, ఏసియన్ పెయింట్స్, టెక్ మహేంద్ర, ఇన్ఫోసిస్,హెచ్‌సీఎల్ టెక్,మారుతి, భారతీ ఎయర్‌టెల్, పవర్‌గ్రిడ్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
ముప్పై షేర్ల ఇండెక్స్‌లో సన్ ఫార్మా, ఎస్బీఐ, బజాజ్ ఆటో షేర్లు మాత్రమే నష్టాల్లో కొనసాగుతున్నాయి.