ETV Bharat / business

రూ.75,00,000 కోట్లు.. ఏడాదిలో పెరిగిన మదుపర్ల సంపద - భారీగా పెరిగిన స్టాక్​ మాక్కెట్​ విలువ

Market Earnings: మార్కెట్‌ దూకుడులో, ఐపీఓల జోరులో ఈ ఏడాది కీలక పాత్ర పోషించింది రిటైల్‌ (చిన్న) మదుపర్లే. మునుపెన్నడూ లేనంతగా డీమ్యాట్‌ ఖాతాల సంఖ్య భారీగా, దూకుడుగా పెరగడమే కాదు.. క్రమానుగత పెట్టుబడి పథకాలైన సిప్‌లలో పెట్టబడులు రూ.లక్ష కోట్లకు చేరడమే ఇందుకు తార్కాణం. అందుకే 2021ను రిటైల్‌ ఇన్వెస్టర్ల నామ సంవత్సరమని పిలవ వచ్చేమో..! విదేశీ మదుపర్లు విక్రయాలకు దిగినా, సూచీలు మరీ క్షీణించకుండా నిలిచింది కూడా రిటైల్‌ మదుపర్ల వల్లే.

stock market earnings
స్టాక్ మార్కెట్ లాభాలు
author img

By

Published : Dec 31, 2021, 7:41 AM IST

Market Earnings: రికార్డులు.. రిటర్న్‌లు.. రిటైల్‌ ఇన్వెస్టర్లు.. 2021లో స్టాక్‌ మార్కెట్‌ గురించి చెప్పాలంటే ఈ పదాలు సరిపోతాయేమో.

సెన్సెక్స్‌ 50,000 పాయింట్లు, 60,000 పాయింట్ల మైలురాళ్లను అధిగమించింది ఈ ఏడాదే. నిఫ్టీ వారానికో రికార్డుతో 18000 పాయింట్లను చేరిందీ ఈ సంవత్సరమే. ఇక.. కొత్త జీవన కాల గరిష్ఠాలైతే ఎన్ని సార్లు మారాయో..

కొవిడ్‌-19 రెండో దశ పరిణామాలు చోటుచేసుకున్నా.. ఆఖర్లో కొత్త ఉత్పరివర్తనం ఒమిక్రాన్‌ కేసులు భయపెడుతున్నా, మదుపర్లకు సెన్సెక్స్‌, నిఫ్టీలు అందించిన రిటర్న్‌లు (ప్రతిఫలం) 20 శాతం పైనే..

మార్కెట్‌ దూకుడులో, ఐపీఓల జోరులో ఈ ఏడాది కీలక పాత్ర పోషించింది రిటైల్‌ (చిన్న) మదుపర్లే. మునుపెన్నడూ లేనంతగా డీమ్యాట్‌ ఖాతాల సంఖ్య భారీగా, దూకుడుగా పెరగడమే కాదు.. క్రమానుగత పెట్టుబడి పథకాలైన సిప్‌లలో పెట్టబడులు రూ.లక్ష కోట్లకు చేరడమే ఇందుకు తార్కాణం. అందుకే 2021ను రిటైల్‌ ఇన్వెస్టర్ల నామ సంవత్సరమని పిలవ వచ్చేమో.. విదేశీ మదుపర్లు విక్రయాలకు దిగినా, సూచీలు మరీ క్షీణించకుండా నిలిచింది కూడా రిటైల్‌ మదుపర్ల వల్లే.

ఒకటా.. రెండా.. ఎన్నెన్ని రికార్డులు.. సెన్సెక్స్‌.. నిఫ్టీ.. జోడు గుర్రాల్లా దూసుకెళ్లాయి.. మదుపర్లను లాభాశ్చర్యంలో ముంచెత్తాయి. బడ్జెట్‌ తర్వాత నుంచి ఆరంభమైన సూచీల జోరుకు.. కొవిడ్‌-19 రెండో దశ పరిణామాలతో మధ్యలో కళ్లెం పడింది. 2020 మార్చి తరహాలో మార్కెట్లు మళ్లీ భారీగా పతనమవుతాయనే భయాలూ వెంటాడాయి. వాటన్నింటినీ పటాపంచాలు చేస్తూ ఆ తర్వాత సూచీలు చెలరేగాయి. రికార్డు మైలురాళ్లను ఒక్కొక్కటి అధిగమిస్తూ.. కొత్త శిఖరాలను అధిరోహించాయి. 'మార్కెట్‌ బాగా పెరిగింది.. ఇక నుంచి పడిపోతుందేమో' అని అనుకున్న ప్రతిసారీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. దూసుకెళ్లింది. మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలోని కంపెనీల మార్కెట్‌ విలువ 2020 డిసెంబరు ఆఖరుకు రూ.1,88,03,518.60 కోట్లుగా ఉండగా.. ఇప్పుడు రూ.75,00,000 కోట్లు పెరిగి రూ.2,63,14,475.66 కోట్లకు చేరింది. నిఫ్టీ 19,000 పాయింట్లను చేరకపోవడం, పేటీఎం షేర్ల పేలవ నమోదు మినహా.. సంవత్సరమంతా స్టాక్‌ మార్కెట్‌ లాభప్రదంగానే గడిచింది. అందుకే 2021.. నిన్ను మరిచేదేలే!!

కలిసొచ్చాయి ఇవే..

స్టాక్‌ మార్కెట్‌ బండి జోరుకు కిక్‌ కొట్టి స్టార్ట్‌ చేసింది బడ్జెట్టే. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్కరణలు.. ముఖ్యంగా మౌలిక రంగానికి గణనీయ కేటాయింపులు చేయడం సూచీల పరుగుకు ఉపకరించాయి. అలా సాఫీగా సాగుతున్న ప్రయాణానికి.. కొవిడ్‌-19 రెండో దశ పరిణామాల రూపంలో స్పీడ్‌ బ్రేకర్లు ఎదురయ్యాయి. బండి ఒక్కసారిగా నెమ్మదించింది. సరిగ్గా అప్పుడే ఆర్‌బీఐ ఉద్దీపనల 'శక్తి' అందడంతో మళ్లీ జోష్‌ తీసుకొచ్చింది. కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం వేగవంతం కావడంతో, సూచీల పరుగుకు పచ్చజెండా ఊపినట్లయ్యింది. కొవిడ్‌ కష్టాల నుంచి ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందన్న ఆశలతో ఇక 'వెనక్కి తిరిగి చూసేదేలే' అన్నట్లుగా సూచీలు దూసుకెళ్లాయి.

stock market earnings
మార్కెట్​ విలువ ప్రకారం అత్యుత్తమ సంస్థలు

పేటీఎం.. నష్టాల మచ్చ

పబ్లిక్‌ ఇష్యూలపరంగా 2021 నభూతో.. అన్నట్లు సాగింది. గత మూడేళ్లలో వచ్చిన ఐపీఓల సంఖ్య, సమీకరించిన నిధులను కలిపినా.. ఈ ఏడాది వచ్చిన ఐపీఓలు, సమీకరించిన నిధుల విలువకు సమానం కాదు. 63 కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూలకు రాగా.. వీటిల్లో అత్యధిక ఇష్యూలకు మదుపర్ల నుంచి విశేష ఆదరణ లభించింది. నమోదు రోజే భారీగా ప్రతిఫలాన్ని అందించిన షేర్లూ ఉన్నాయి. జొమాటో, నైకా సంస్థలు మొదటి రోజే రూ.1 లక్ష కోట్ల మార్కెట్‌ విలువను సాధించాయి. అతిపెద్ద ఐపీఓ (రూ.18,300 కోట్లు)గా ముందుకొచ్చిన పేటీఎం షేరు మాత్రం, నమోదు రోజు 27 శాతం పతనమై మదుపర్లకు భారీ నష్టం మిగిల్చింది. ఇష్యూ ధర రూ.2,150 కాగా.. ప్రస్తుతం రూ.1,341.95 వద్ద ట్రేడవుతోంది. అంటే దాదాపుగా 38 శాతం మేర పెట్టుబడి ఆవిరైందన్నమాట.

stock market earnings
జీవన కాల గరిష్ఠాలను చూసిన సూచీలు

చిన్న షేర్లు.. అదుర్స్‌

2021లో చిన్న కంపెనీల షేర్లు అదిరేపోయే ప్రదర్శనను కనబర్చాయి. దిగ్గజ, మధ్య తరహా కంపెనీల షేర్లకు మించి రాణించాయి. బీఎస్‌ఈ మధ్య తరహా కంపెనీల సూచీ 37.41 శాతం పెరగగా.. చిన్న తరహా కంపెనీల షేర్లు 59.81 శాతం ప్రతిఫలాన్ని అందించాయి.

stock market earnings
వంద శాతానికి పైగా లాభాలు తెచ్చి పెట్టిన కంపెనీలు

ఇదీ చూడండి: 'ఆయిల్ సర్వే'లో విస్తుపోయే నిజాలు.. వంటనూనెలు కల్తీమయం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.