Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాలతో ముగిశాయి. రెండో సెషన్లో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 477పాయింట్లు పెరిగింది. 57,891 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 147 పాయింట్లు లాభపడి.. 17,233 వద్ద ముగిసింది.
అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలతో తోడు ఒమిక్రాన్ వల్ల హాస్పిటలైజేషన్ పెరగకపోవచ్చుననే అధ్యయనాలు ప్రపంచవ్యాప్తంగా మదుపర్లలో విశ్వాసం నింపాయి. అమెరికా మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు సైతం నేడు లాభాల్లో కొనసాగాయి. ఫలితంగా దేశీయ సూచీలు లాభపడ్డాయి.
ఇంట్రాడే సాగిందిలా..
ఉదయం 57,751 పాయింట్లు వద్ద లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్.. ఆసాంతం లాభాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 57,650 వద్ద కనిష్ఠాన్ని తాకిన సూచీ.. 57,952 వద్ద గరిష్ఠానికి చేరింది.
మరో సూచీ నిఫ్టీ ఇంట్రాడేలో 17,161 వద్ద అత్యల్పస్థాయి.. 17,250 పాయింట్ల గరిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోని ఇవే..
ముప్పై షేర్ల ఇండెక్స్‌లో... ఇండస్ఇండ్బ్యాంకు, పవర్ గ్రిడ్ షేర్లు మాత్రమే నష్టాల్లో ముగిశాయి.
ఇదీ చూడండి: 'ఇకపై టాటా భవిష్యత్తు ప్రాధాన్యతలు అవే'