Stock Market Closing: కొత్త ఏడాది వరుసగా మూడోరోజు స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 367పాయింట్లు వృద్ధితో 60వేల 223 వద్దకు చేరింది. నిప్టీ 120 పాయింట్ల లాభంతో 17వేల 925 వద్ద స్థిరపడింది.
ఇంట్రాడే సాగిందిలా..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 73 పాయింట్ల నష్టంతో 59,782వద్ద ప్రారంభమై.. కొద్దిసేపటికే 59,661పాయింట్ల కనిష్ఠ స్థాయికి చేరింది. ఆ తర్వాత కొద్దిసేపు ఒడుదొడుకుల మధ్య 60వేల మార్కును దాటింది. ఒకానొక సమయంలో 60,332 గరిష్ఠ స్థాయిని తాకింది సెన్సెక్స్. చివరి వరకు 60వేల మార్కును కొనసాగించి.. 367పాయింట్లు వృద్ధితో 60వేల 223 వద్ద స్థిరపడింది.
నిఫ్టీ.. 17వేల 749 పాయింట్ల కనిష్ఠ, 17వేల 945 పాయింట్ల గరిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
సెన్సెక్స్ 30 ప్యాక్‌లో.. బజాజ్‌ఫైనాన్స్, అల్ట్రాసెమ్కో, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, కొటక్ మహీంద్రా షేర్లు లాభాలను నమోదు చేశాయి.
ఎస్బీఐ, డాక్టర్ రెడ్డీస్, టాటా స్టీల్, ఎన్టీపీసీ, టైటాన్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి.