Stock Market Closing: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పవనాలతో స్టాక్ మార్కెట్లు కొత్త ఏడాది రెండో రోజూ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 672 పాయింట్ల వృద్ధితో 59వేల 855వద్ద స్థిరపడింది. నిప్టీ 179 పాయింట్ల లాభంతో 17వేల 805 వద్దకు చేరింది.
ఇంట్రాడే సాగిందిలా..
59,343 పాయింట్లతో ప్రారంభమైన సెన్సెక్స్.. కొద్దిసేపటి తర్వాత 59,084 పాయింట్ల అత్యల్పస్థాయిని నమోదుచేసింది. తర్వాత కోలుకుని 59,937 పాయింట్ల గరిష్ఠస్థాయికి చేరింది. చివరకు 59,855 వద్ద స్థిరపడింది.
నిఫ్టీ.. 17,681 పాయింట్లతో ప్రారంభమైంది. కొద్దిసేపటి తర్వాత 17,593 కనిష్ఠస్థాయికి వెళ్లింది. 17,827 రికార్డు స్థాయికి చేరుకుని.. చివరకు 17,805 వద్దకు చేరింది.
భారీగా పెరిగిన మదుపర్ల సంపద..
కొత్త ఏడాది రెండోరోజూ స్టాక్ మార్కెట్ల భారీ లాభాలు నమోదు చేయడం వల్ల మదుపర్ల సంపద భారీగా పెరిగింది. కేవలం రెండురోజుల్లోనే మదుపరుల సంపద విలువ దాదాపు రూ. 5లక్షల కోట్ల మేర ఎగబాకింది.
లాభనష్ఠాలు
- ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్, ఎస్బీఐఇన్, రిలయన్స్, టైటాన్, టీసీఎస్, యాక్సిస్ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ, కొటక్ ఫైనాన్స్, మారుతి షేర్లు లాభాలు గడించాయి.
- ఇన్ఫీ, డాక్టర్ రెడ్డీస్, సన్‌ఫార్మా, అల్ట్రాసిమ్కో, ఇండస్ఐండ్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.