ETV Bharat / business

యుద్ధం జరుగుతున్నా దూసుకెళ్లిన సూచీలు.. సెన్సెక్స్​ 1300 ప్లస్​

Stock Market Close: రష్యా- ఉక్రెయిన్​ మధ్య యుద్ధం నేపథ్యంలోనూ దేశీయ స్టాక్​ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. 7 రోజుల వరుస నష్టాల అనంతరం ఎట్టకేలకు సూచీలు బలంగా పుంజుకున్నాయి. సెన్సెక్స్​ 1329, నిఫ్టీ 410 పాయింట్ల మేర పెరిగాయి.

Stock Market Close
Stock Market Close
author img

By

Published : Feb 25, 2022, 3:44 PM IST

Stock Market Close: రికార్డు స్థాయి నష్టాల మరుసటి రోజే స్టాక్​ మార్కెట్లు బలంగా పుంజుకున్నాయి. క్రితం సెషన్​లో భారీ నష్టాల నేపథ్యంలో.. కనిష్ఠాల వద్ద ఆరంభంలో కొనుగోళ్ల మద్దతు లభించింది.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 1329​ పాయింట్లు(2.44%) పెరిగి 55 వేల 859 వద్ద స్థిరపడింది.

సెన్సెక్స్​ దాదాపు 800 పాయింట్ల లాభంతో సెషన్​ను ప్రారంభించింది. ఉదయం 9.30 గంటల అనంతరం.. మరింత పుంజుకుంది. ఓ దశలో 1650 పాయింట్లకుపైగా పెరిగి 56 వేల 184 వద్ద సెషన్​ గరిష్ఠాన్ని నమోదు చేసింది. 55,299 వద్ద కనిష్ఠాన్ని తాకింది.

నేషనల్​ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 410 పాయింట్ల (2.53%) లాభంతో 16,658 వద్ద సెషన్​ను ముగించింది.

బీఎస్​ఈ మిడ్​, స్మాల్​క్యాప్​ సూచీలు 4 శాతం చొప్పున పెరిగాయి. బ్యాంకింగ్​, విద్యుత్​, లోహ, రియాల్టీ రంగం షేర్లు 4 నుంచి 6 శాతం మేర లాభపడ్డాయి.

మొత్తంగా 2567 షేర్లు రాణించాయి. 724 షేర్లు డీలాపడ్డాయి. 89 షేర్లలో ఎలాంటి మార్పు లేదు.

అమెరికా మార్కెట్లు కూడా..

అమెరికా సహా ఇతర ఐరోపా దేశాలు రష్యాపై కఠిన ఆంక్షలు విధించాయి. దీంతో అమెరికా స్టాక్​ మార్కెట్లలో నాస్​డాక్​ 3 శాతానికిపైగా పెరిగింది. ఎస్​ అండ్​ పీ 1.50 %, డౌ 0.28 శాతం లాభపడ్డాయి. దీనికి అనుగుణంగానే.. ఆసియా మార్కెట్లు కూడా తేరుకున్నాయి.

లాభనష్టాల్లో..

బీఎస్​ఈ 30 ప్యాక్​లో నెస్లే ఇండియా (0.25 శాతం డౌన్​) తప్ప అన్నీ లాభపడ్డాయి. టాటా స్టీల్​ అత్యధికంగా 6 శాతానికిపైగా పెరిగింది. ఇండస్​ఇండ్​ బ్యాంక్​, ఎన్​టీపీసీ, బజాజ్​ ఫినాన్స్​, టెక్​ మహీంద్రా, యాక్సిస్​ బ్యాంక్​, టీసీఎస్​ భారీగానే పుంజుకున్నాయి.

నిఫ్టీ 50లో బ్రిటానియా, హెచ్​యూఎల్​ స్వల్పంగా నష్టపోయాయి. ​

Ukraine Russia War: ఉక్రెయిన్​- రష్యా యుద్ధం కారణంగా.. గురువారం సెషన్​లో దేశీయ సూచీలు కుప్పకూలాయి. సెన్సెక్స్​ 2702 పాయింట్లు కోల్పోయింది. దాదాపు రెండేళ్లలోనే ఒకరోజు అతిపెద్ద నష్టం ఇదే. నిఫ్టీ 815 పడి.. 16 వేల 300 దిగువకు చేరింది.

ఉక్రెయిన్​ సంక్షోభంతో.. విదేశీ సంస్థాగత మదుపరులు(ఎఫ్​ఐఐ) గురువారం రూ. 6,448 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు.

ఇవీ చూడండి: భారీగా పెరిగిన బంగారం ధరలు- ఏపీ, తెలంగాణలో ఎంతంటే..?

రష్యా-ఉక్రెయిన్​ యుద్ధంతో గ్యాస్ ధరకు రెక్కలు- వాటికి తీవ్ర కొరత!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.