ETV Bharat / business

వృద్ధి భయాలతో.. నష్టాల్లో స్టాక్​ మార్కెట్లు

ఆర్థిక వృద్ధి మందగమనం భయాలతో స్టాక్​ మార్కెట్లు వరుసగా మూడోరోజు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఆరంభ ట్రేడింగ్​లో సెన్సెక్స్​ 200 పాయింట్లకు పైగా నష్టపోయింది. నిఫ్టీ 12 వేల దిగువన ట్రేడవుతోంది.

Sensex
వృద్ధి భయాలతో.. నష్టాల్లో స్టాక్​ మార్కెట్లు
author img

By

Published : Feb 18, 2020, 9:52 AM IST

Updated : Mar 1, 2020, 4:59 PM IST

దేశీయ స్టాక్​ మార్కెట్లు వరుసగా మూడోరోజు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్​ విజృంభనతో ఆర్థిక వృద్ధి మందగమనంపై ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. కొవిడ్​-19​ ప్రభావంతో ఆపిల్​ సంస్థ చేసిన ప్రకటన కూడా నష్టాలకు ఆజ్యం పోసింది.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్​ 258 పాయింట్ల నష్టంతో 40,797 వద్ద ట్రేడవుతోంది.

జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ- నిఫ్టీ 82 పాయింట్లు కోల్పోయి 11,963 వద్ద కొనసాగుతోంది.

లాభనష్టాల్లోనివి..

జీ ఎంటర్​టైన్​మెంట్​, గెయిల్​, టెక్​ మహీంద్రా, సిప్లాలు లాభాల్లో కొనసాగుతున్నాయి. యెస్​ బ్యాంక్​, ఇండస్​ఇండ్​ బ్యాంక్​, భారతీ ఇన్​ఫ్రాటెల్​, వేదాంత, టాటా స్టీల్​ నష్టాల్లోకి వెళ్లాయి.

ఆసియా మార్కెట్లు పతనం..

నిక్కీ, సాంఘై, హెచ్​ఎస్​ఐ, మలేసియా మార్కెట్లపైనా కరోనా వైరస్​ ప్రభావం తీవ్రంగా ఉంది. నేటి ఆరంభ ట్రేండింగ్​లో నష్టాల్లోకి వెళ్లాయి.

రూపాయి..

అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి మారకపు విలువ డాలరుతో పోలిస్తే 10 పైసలు నష్టపోయి రూ.71.42 వద్ద అమ్ముడవుతోంది.

Last Updated : Mar 1, 2020, 4:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.