ఆద్యంతం ఒడుదొడుకులతో సాగిన సెషన్లో స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ 117.77 పాయింట్లు కోల్పోయి 39 వేల 714.20 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ- నిఫ్టీ 23.10 పాయింట్లు కోల్పోయి 11 వేల 922.80 వద్ద ముగిసింది.
జీడీపీ వృద్ధి గణాంకాలు విడుదల కానున్న నేపథ్యంలో పెట్టుబడిదారులు కాస్త ముందు జాగ్రత్త వహించడం ఇందుకు కారణం. ప్రపంచ మార్కెట్ల మందగమనం మరో కారణం. వాహన, ఆర్థిక రంగాల షేర్లు ఎక్కువగా నష్టపోయాయి.
వారం మొత్తంగా చూస్తే... సెన్సెక్స్ 279.4 పాయింట్లు, నిఫ్టీ 78.70 పాయింట్లు లాభపడ్డాయి.
లాభ, నష్టాల్లో...
ఎస్ బ్యాంకు సుమారు 4.27 శాతం నష్టపోయింది. ఐటీసీ, వేదాంత, ఎమ్ అండ్ ఎమ్ వాటా విలువ సుమారు 3.61 శాతం వరకు తగ్గాయి.
ఏషియన్ పెయింట్స్, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్ సుమారు 2.43 శాతం వరకు లాభాలను ఆర్జించాయి.
తగ్గిన ముడిచమురు ధరలు..
ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరలు 2.60 శాతం క్షీణించాయి. ప్రస్తుతం బ్యారల్ ముడిచమురు ధర 63.62 డాలర్లుగా ఉంది.
పెరిగిన రూపాయి విలువ
అమెరికా డాలర్లో పోల్చితే రూపాయి విలువ పెరిగి రూ.69.82లకు చేరుకుంది.
ఇదీ చూడండి: బిమ్స్టెక్ నేతలతో మోదీ స్నేహగీతం