చైనా మెల్లగా గాడినపడుతోందనే వార్తలతో మార్కెట్లకు ఊరట లభించింది. కంపెనీలకు ముడిసరకు సరఫరా పునరుద్ధరణ జరుగుతుందన్న నమ్మకంతో సూచీలు పుంజుకున్నాయి. సెన్సెక్స్ 800 పాయింట్లకు పైగా లాభంతో ఆరంభమవగా.. నిఫ్టీ 8,400 మార్క్‌ను అందుకుంది.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ ప్రస్తుతం 648 పాయింట్ల లాభంతో 29,089 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 193 పాయింట్లు వృద్ధితో 8,474 వద్ద కొనసాగుతోంది.
లాభాల్లో...
టాటాస్టీల్, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంక్, ఎమ్ అండ్ ఎమ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఓఎన్జీసీ, ఐటీసీ, హెచ్‌సీఎల్ టెక్, టైటాన్ సంస్థలు దాదాపు 3 శాతం లాభపడ్డాయి.
నష్టాల్లో...
ఇండస్ఇండ్ బ్యాంక్ షేరు 15 శాతం పడిపోయింది. బజాజ్ ఫైనాస్స్, బజాజ్ ఆటో, మారుతీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
షాంఘై సూచీ లాభాల్లో ఉంది. చైనాలో పరిశ్రమలు దాదాపు తెరుచుకున్నాయి. చైనావ్యాప్తంగా 98.6 శాతం భారీ పరిశ్రమలు ఉత్పత్తి పునరుద్ధరించాయి.
హాంకాంగ్, టోక్యో, సియోల్‌లో మార్కెట్లు లాభాల్లోనే ఉన్నాయి.
రూపాయి...
డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 10 పైసలు పెరిగి రూ.75.48 వద్ద ఉంది.
చమురుధరలు...
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ 2.16 శాతం పెరిగింది. బ్యారెల్ ముడిచమురు ధర 26.99 డాలర్లకు చేరింది.