ETV Bharat / business

ఒక్క ప్రకటనతో భారీ లాభాల నుంచి నష్టాల్లోకి.. - Stock mid session

లాభాలతో ఆరంభమైన మార్కెట్లు ఆర్​బీఐ ప్రకటనతో నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ ఒకానొక దశలో 1,700 పాయింట్లకు పైగా పడిపోయింది. కరోనా సంక్షోభ సమయంలో ఆర్థిక వ్యవస్థకు తోడ్పడే చర్యలను ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్ ప్రకటించారు. అయినప్పటికీ మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి.

sensex slumps
ఒక్క ప్రకటనతో భారీ లాభాల నుంచి నష్టాల్లోకి..
author img

By

Published : Mar 27, 2020, 1:19 PM IST

కరోనా వల్ల​ వార్షిక జీడీపీ వృద్ధి రేటు గణనీయంగా తగ్గే ప్రమాదముందని ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్​ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ఈ ప్రకటన చేసిన కాసేపటికే ఆరంభ లాభాల్ని కోల్పోయి నష్టాల్లోకి జారుకున్నాయి స్టాక్​మార్కెట్లు.

ఉదయం 11.30 గంటలకు 30 షేర్ల సూచీ సెన్సెక్స్​ 407 పాయింట్లు కోల్పోయి 29,539 వద్ద ఉంది. నిఫ్టీ 9 వేల మార్కును కోల్పోయింది. 71 పాయింట్లు క్షీణించి 8,569 వద్ద నిలిచింది.

నష్టాల్లో...

30 షేర్ల బీఎస్​ఈలో భారతీ ఎయిర్​టెల్ భారీగా నష్టపోయింది. ​సంస్థ షేర్లు 6 శాతం నష్టపోయాయి. హెచ్​సీఎల్​ టెక్​, హీరో మోటోకార్ప్​, మారుతీ, ఏషియన్​ పెయింట్స్​, బజాజ్​ ఆటో నష్టాల బాట పట్టాయి.

లాభాల్లో...

యాక్సిస్​ బ్యాంక్​, ఇండస్​ఇండ్​ బ్యాంక్​, ఎన్​టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్​, పవర్​గ్రిడ్​ లాభాల్లో ఉన్నాయి.

వడ్డీ రేట్లు భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నప్పటికీ వార్షిక వృద్ధి రేటుపై ఆర్​బీఐ గవర్నర్​ ఆందోళన చెందడం మార్కెట్​ను నష్టాల్లోకి నెట్టాయని నిపుణులు అభిప్రాయపడ్డారు.

రూపాయి...

ఇంట్రాడేలో యూఎస్​ డాలర్​తో పోలిస్తే రూపాయి విలువ 81 పైసలు పెరిగి రూ.74.35 వద్ద ఉంది.

కీలక నిర్ణయాలు...

దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్‌ తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో ఆర్‌బీఐ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కీలక వడ్డీ రేట్లను భారీగా తగ్గించింది. రెపోరేటును 4.4 శాతానికి తగ్గించింది. 15 ఏళ్లలో ఇదే అత్యల్పం.

వీటితో పాటు టెర్మ్​ లోన్స్​ నెలవారీ వాయిదాల చెల్లింపుపై 3 నెలల మారటోరియం విధించేందుకు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు అనుమతి ఇచ్చింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.