ETV Bharat / business

పెట్రో మంట, రూపాయి పతనంతో నష్టాలు - ముడి చమురు ధరలు

స్టాక్​మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. పెట్రో ధరల పెరుగుదల, రూపాయి బలహీనం ఇందుకు ప్రధాన కారణం. వాహన, లోహ, ఇంధన, ఆర్థిక రంగాల వాటాలు ఎక్కువగా అమ్మకాల ఒత్తిడి చవిచూశాయి.

పెట్రో మంట, రూపాయి పతనంతో నష్టాలు
author img

By

Published : Apr 25, 2019, 4:48 PM IST

సెషన్​ ఆఖరి అరగంటలో మదుపర్లు ఒక్కసారిగా అమ్మకాలకు దిగగా.. స్టాక్​మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్​ చివరకు 324 పాయింట్లు కోల్పోయింది. 38వేల 731వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 84 పాయింట్లు తగ్గి 11వేల 642వద్ద ముగిసింది.

ఇవీ కారణాలు...

* ముడి చమురు ధర 1.25శాతం పెరగడం

* రూపాయి బలహీనపడడం

* ఏప్రిల్​ డెరివేటివ్​ల కాంట్రాక్టు ముగింపు వేళ మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించడం

నష్టాల్లో...

టాటా స్టీల్​, వేదాంత, మారుతీ, ఎస్​బీఐ, కోల్​ ఇండియా, టాటా మోటార్స్, సన్​ఫార్మా, హెచ్​యూఎల్​, ఆర్​ఐఎల్​, ఇండస్​ఇండ్​ బ్యాంకు, యాక్సిస్​ బ్యాంకు, హెచ్​డీఎఫ్​సీ డ్యుయో, ఐసీఐసీఐ బ్యాంకు, ఎమ్ అండ్​ ఎమ్, కోటక్​ బ్యాంకు, ఇన్ఫోసిస్​ (సుమారు 2.89 శాతం) నష్టపోయాయి.

దేశీయ కార్ల తయారీ సంస్థల్లో అతిపెద్దదైన 'మారుతీ' షేర్ ఇవాళ 2.23 శాతం నష్టపోయింది. మార్చి త్రైమాసికంలో మారుతి నికరలాభం 4.6 శాతం క్షీణించి రూ.1,795 కోట్లకు చేరింది.

లాభాల్లో..

భారతీ ఎయిర్​టెల్​, టీసీఎస్​, బజాజ్​ ఆటో ( సుమారు 2.08 శాతం) లాభాలను ఆర్జించాయి.

చమురు మంట

అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు ఒక్కసారిగా 1.25 శాతానికి పెరిగాయి. ఫలితంగా ప్రస్తుతం బ్యారెల్​ ముడిచమురు ధర 75 డాలర్లకు చేరుకుంది.

రూపాయి విలువ క్షీణత

రూపాయి విలువ 37 పైసలు క్షీణించి, డాలర్​కు రూ.70.23 లుగా ఉంది.

ఇదీ చూడండి: అంతర్గత విచారణ కమిటీకి జస్టిస్​ రమణ దూరం

Siliguri (West Bengal), Apr 25 (ANI): In a bid to spread awareness regarding preserving one's mother tongue, 29-year-old Gandhar Kulkarni has embarked on a 20,000-kilometre journey on his bicycle. Hailing from Maharashtra, Kulkarni aims to enlighten the younger generation and help them reconnect with their mother tongue. A postgraduate in Sanskrit, Kulkarni said that he started this expedition on July 01, 2018, and intends to complete it by August 15 this year. He told ANI, "I started this initiative to create awareness about one's mother tongue and put an emphasis on this in schools. One must read all languages but they should learn their mother tongue first."

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.