స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. బ్యాంకింగ్, వాహన రంగాల్లో కొనుగోళ్ల మద్దతుతో సెన్సెక్స్ 164 పాయింట్లు లాభపడింది. చివరకు 37వేల 145 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 56.85 పాయింట్లు పెరిగి 11,003 వద్ద ముగిసింది.
ఈ ఉదయం సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆసియా మార్కెట్లు లాభాల బాట పట్టిన నేపథ్యంలో దేశీయ మార్కెట్లు ఒడుదొడుకుల నుంచి బయటపడ్డాయి. ఒకానొక దశలో 36,784కు చేరుకున్న సెన్సెక్స్.. 460 పాయింట్లు మెరుగై 37,145కు చేరుకుంది. నిఫ్టీ కూడా మొదట భారీగా పడిపోయిన తిరిగి కోలుకుని 11,003 పాయింట్ల వద్ద స్థిరపడింది.
డాలర్‌తో రూపాయి మారకం విలువ 71.67గా కొనసాగుతోంది.
లాభనష్టాల్లో..
ఎన్‌ఎస్‌ఈలో ఎస్ బ్యాంక్, యూపీఎల్ లిమిటెడ్, మారుతి సుజుకీ, ఎల్ అండ్ టీ, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు 4.47 శాతం లాభపడ్డాయి.
హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఐషర్ మోటార్స్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, బజాజ్ ఆటో 1.50 శాతం నష్టపోయాయి.
ఆసియాలో షాంఘై, జపాన్ లాభాలు అర్జించగా.. హాంకాంగ్ మార్కెట్లు డీలా పడ్డాయి.
అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగాయి. బ్యారెల్ చమురు ధర 62.03 డాలర్లకు చేరుకుంది.
ఇదీ చూడండి: రుణాలపై వడ్డీరేట్లు మరింత తగ్గించిన స్టేట్ బ్యాంక్