ETV Bharat / business

Stock market today: ఆరంభంలో నష్టాలు... ఆఖరికి లాభాలు... - నిఫ్టీ ఇండియా టుడే

(Stock market today) దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు సోమవారం సెషన్​ను లాభాలతో ముగించాయి. ప్రారంభంలో నష్టాలను చవిచూసిన మార్కెట్లు.. క్రమంగా కోలుకుని లాభాల బాట పట్టాయి. దీంతో సెన్సెక్స్​ (sensex today) 153, నిఫ్టీ (nifty today) 28 పాయింట్ల మేర పెరిగాయి.

stock markket
స్టాక్​ మార్కెట్​
author img

By

Published : Nov 29, 2021, 3:39 PM IST

Updated : Nov 29, 2021, 6:42 PM IST

స్టాక్ ​మార్కెట్లు సోమవారం సెషన్​ను లాభాలతో ముగించాయి. ఉదయం నష్టాలతో మొదలైన సూచీలు మెల్లగా లాభాల్లోకి వచ్చాయి. ఐటీ రంగ షేర్లు(Stocks in news) రాణించి సూచీలకు దన్నుగా నిలిచాయి. రిలయన్స్‌ టారిఫ్‌లు పెంచడం, ప్రైవేటు బ్యాంకుల్లో ప్రమోటర్ల వాటాపై ఆర్‌బీఐ సానుకూల ప్రతిపాదనలు, ముడి చమురు ధరలు తగ్గడం, వివిధ దేశాల కరెన్సీలు కోలుకోవడం వంటి పరిణామాలు సూచీలకు కలిసొచ్చాయి. దీంతో బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ (Sensex today India) సెన్సెక్స్ 153 పాయింట్లు పెరిగి.. 57,261 వద్ద స్థిరపడింది.

జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ (nifty today) 28 పాయింట్ల లాభంతో 17,054 వద్ద సెషన్​ను(Stock market news) ముగించింది.

ఇంట్రాడేలో ఇలా..

  • బీఎస్​ఈ సెన్సెక్స్​ 57,627 పాయింట్ల గరిష్ఠాన్ని.. 56,382 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.
  • ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 17,161 పాయింట్ల అత్యధిక స్థాయిని.. 16,782 పాయింట్ల అత్యల్ప స్థాయి మధ్య కదలాడింది.

లాభనష్టాల్లో..

  • కోటక్​ మహీంద్ర, హెచ్​సీఎల్​ టెక్​, టీసీఎస్​, రిలయన్స్​, బజాజ్​ ఫినాన్స్, బజాజ్​ ఫిన్​సర్వ్​ షేర్లు (Stocks in news) రాణించాయి.
  • ఎన్​టీపీసీ, సన్​ఫార్మా, నెస్లే, ఐటీసీ, యాక్సిస్​ బ్యాంక్​ షేర్లు నష్టాలను చవిచూశాయి.

ఇవీ చూడండి:

Fuel price reduction: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం!

గుడ్​ న్యూస్​.. డిసెంబరులో తగ్గనున్న గ్యాస్ ధర!

jio tariff hike: జియో యూజర్లకు బ్యాడ్ న్యూస్- ప్రీపెయిడ్ ఛార్జీలు పెంపు

Last Updated : Nov 29, 2021, 6:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.