ETV Bharat / business

స్టాక్ మార్కెట్ల కొత్త రికార్డు- 58,700పైకి సెన్సెక్స్ - nifty share price

స్టాక్ మార్కెట్లు (Stocks Today) మరోసారి రికార్డు సృష్టించాయి. బుధవారం సెషన్​లో సెన్సెక్స్ (Sensex Today) 476 పాయింట్లు పెరిగి.. జీవనకాల గరిష్ఠమైన 58,700 మార్క్​ను దాటింది. నిఫ్టీ (Nifty Today) 139 పాయింట్లు​ బలపడి సరికొత్త రికార్డు స్థాయి అయిన 17,500పైకి చేరింది.

stocks new record
స్టాక్ మార్కెట్ల రికార్డు
author img

By

Published : Sep 15, 2021, 3:44 PM IST

స్టాక్ మార్కెట్లు (Stocks Today) బుధవారం భారీ లాభాలతో ముగిశాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ (Sensex today) 476 పాయింట్లు పెరిగి నూతన గరిష్ఠమైన 58,723 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ (Nifty today) 139 పాయింట్ల లాభంతో జీవనకాల గరిష్ఠమైన 17,519 వద్దకు చేరింది.

ఐటీ, బ్యాంకింగ్ షేర్లు లాభాల జోరు మార్కెట్ల రికార్డుకు కారణంగా తెలుస్తోంది. దీనికి తోడు ఆగస్టు నెలకు సంబంధించి ఆర్థిక గణాంకాలు సానుకూలంగా ఉండటం కూడా కలిసొచ్చినట్లు విశ్లేషణలు వస్తున్నాయి.

ఇంట్రాడే సాగిందిలా (Intraday)..

సెన్సెక్స్ 58,777 పాయింట్ల అత్యధిక స్థాయి(జీవనకాల గరిష్ఠం), 58,272 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 17,532 పాయింట్ల గరిష్ఠ స్థాయి(కొత్త రికార్డు), 17,386 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

ఎన్​టీపీసీ, భారతీ ఎయిర్​టెల్, టైటాన్​, హెచ్​సీఎల్​టెక్​, ఎస్​బీఐ భారీగా లాభాలను గడించాయి.

ఏషియన్ పెయింట్స్, యాక్సిస్​ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్​ ఫినాన్స్, నెస్లే ఇండియా నష్టాలతో ముగిశాయి.

ఇతర మార్కెట్లు

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో.. కోస్పీ (దక్షిణ కొరియా) సూచీ లాభాలను గడించింది. షాంఘై (చైనా), నిక్కీ (జపాన్​), హాంగ్​సెంగ్ (హాంకాంగ్​) సూచీలు నష్టాలను నమోదు చేశాయి.

ఇదీ చదవండి: పాన్​-ఆధార్​ లింక్ చేయలేదా? రూ.10 వేలు ఫైన్​ ఖాయం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.