స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ- సెన్సెక్స్ (Sensex today) 383 పాయింట్లు పెరిగి 52,232 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ (Nifty today) 114 పాయింట్ల లాభంతో 15,690 వద్దకు చేరింది.
ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ సమీక్ష నిర్ణయాలు శుక్రవారం వెల్లడికానున్న నేపథ్యంలో సానుకూలతలు పెరిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. దీనికి తోడు దేశంలో వ్యాక్సినేషన్ విషయంలో పురోగతి మార్కెట్లకు ఊతమందించినట్లు వివరిస్తున్నారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి హెవీ వెయిట్ షేర్లు, ఆర్థిక, లోహ రంగాలు కూడా లాభాలకు దన్నుగా నిలిచినట్లు తెలుస్తోంది.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 52,273 పాయింట్ల అత్యధిక స్థాయి, 51,942 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 15,705 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 15,394 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
టైటాన్, ఓఎన్జీసీ, ఎల్&టీ, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు లాభాలను గడించాయి.
ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఆటో, వవర్‌గ్రిడ్, హెచ్‌సీఎల్‌టెక్, పవర్‌గ్రిడ్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.
ఇతర మార్కెట్లు
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో నిక్కీ, కోస్పీ సూచీలు లాభాలతో ముగిశాయి. షాంఘై, హాంగ్‌సెంగ్ సూచీలు నష్టాలను నమోదు చేశాయి.
ఇదీ చదవండి:రూ.14 లక్షల కోట్లపైకి రిలయన్స్ ఎం-క్యాప్