అమెరికా-చైనా వాణిజ్య చర్చల్లో పురోగతి, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పవనాలు, విదేశీ నిధుల రాకతో దేశీయ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ప్రారంభంలో ఒడుదొడుకులకు లోనైనప్పటికీ లోహ, ఆటో, బ్యాంకింగ్ రంగ షేర్ల దూకుడుతో లాభాల్లోకి వచ్చాయి.
బాంబే స్టాక్ ఎక్స్చేంజి సూచీ- సెన్సెక్స్ 120 పాయింట్ల లాభంతో 38, 246 వద్ద ట్రేడవుతోంది.
జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ- నిఫ్టీ 34 పాయింట్ల లాభంతో 11,340 వద్ద కొనసాగుతోంది.
లాభనష్టాల్లోనివి...
టాటా మోటర్స్, టాటా స్టీల్, వేదాంత, జేఎస్డబ్ల్యూ స్టీల్, సన్ ఫార్మా, బజాజ్ ఆటో, ఇండస్ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, హెచ్యూఎల్, ఎస్బీఐ షేర్లు సుమారు 4 శాతం లాభాల్లో కొనసాగుతున్నాయి.
ఇన్ఫోసిస్, యూపీఎల్, సిప్లా, పవర్ గ్రిడ్, జీ ఎంటర్టైన్మెంట్, కొటక్ మహీంద్రా బ్యాంక్, టీసీఎస్, టెక్ మహీంద్ర సుమారు 3 శాతం మేర నష్టపోయాయి.
రూపాయి...
రూపాయి మారకపు విలువ డాలరుతో పోలిస్తే 19 పైసలు లాభపడి రూ.70.83 వద్ద అమ్ముడవుతోంది.