స్టాక్ మార్కెట్లలో మూడు రోజుల వరుస లాభాలకు శుక్రవారం బ్రేక్ పడింది. బీఎస్ఈ-సెన్సెక్స్ 487 పాయింట్లు తగ్గి 50,792 వద్దకు చేరింది. ఎన్ఎస్ఈ- నిఫ్టీ 144 పాయింట్లు కోల్పోయి 15,030 వద్ద స్థిరపడింది.
ఆరంభంలో భారీ లాభాలతో ఉత్సాహంగా సాగిన సూచీలు.. మిడ్ సెషన్ తర్వాత ఒక్కసారిగా నష్టాల బాట పట్టాయి. వాహన, ఫార్మా, ఐటీ, బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి ఇందుకు ప్రధాన కారణం.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 51,821 పాయింట్ల అత్యధిక స్థాయి, 50,538 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 15,336 పాయింట్ల గరిష్ఠ స్థాయి 14,953 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
పవర్‌గ్రిడ్, ఓఎన్జీసీ,టైటాన్, ఇన్ఫోసిస్ షేర్లు మాత్రమే 30 షేర్ల ఇండెక్స్‌లో లాభాలను నమోదు చేశాయి.
బజాజ్ ఆటో, మారుతీ, రిలయన్స్, సన్‌ఫార్మా, అల్ట్రాటెక్ సిమెంట్ నష్టాలను మూటగట్టుకున్నాయి.
ఇతర మార్కెట్లు
ఆసియాలో ఇతర ప్రధాన స్టాక్ మార్కెట్లు అయిన.. షాంఘై, టోక్యో సియోల్ సూచీలు లాభాలు నమోదు చేశాయి. హాంకాంగ్ సూచీ భారీ నష్టాల్ని మూటగట్టుకుంది.
ఇదీ చదవండి:షేర్లలో మదుపు.. ఈ పన్ను నిబంధనలు తెలుసా?