స్టాక్ మార్కెట్లలో నేడూ నష్టాల మోత కొనసాగుతోంది. కరోనా భయాలతో విదేశీ మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపుతున్నారు. మరో వైపు అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నాయి. ఫలితంగా ఆ ప్రభావం దేశీయ సూచీలపై కనిపిస్తోంది.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ- సెన్సెక్స్ 378 పాయింట్లకు పైగా నష్టంతో.. ప్రస్తుతం 39,509 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ- నిఫ్టీ 117 పాయింట్లకు పైగా క్షీణతతో 11,561 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
లాభనష్టాల్లోనివివే..
30 షేర్ల ఇండెక్స్‌లో అన్ని షేర్లు నష్టాల్లోనే ఉన్నాయి.
హెచ్‌సీఎల్‌టెక్, ఎం&ఎం, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్ షేర్లు నష్టాల్లో ప్రధానంగా ఉన్నాయి.
రూపాయి, ముడి చమురు
రూపాయి నేడు 2 పైసలు పెరిగి డాలర్‌తో మారకం విలువ రూ.71.63 వద్ద కొనసాగుతోంది.
ముడి చుమురు ధరల సూచీ-బ్రెంట్ 1.19 శాతం తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర 52.18 డాలర్లుగా ఉంది.
ఆసియాలోని ఇతర ప్రధాన మార్కెట్లయిన సియోల్, హాంగ్‌కాంగ్, టోక్యో సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. షాంఘై సూచీ మాత్రం సానుకూలంగా స్పందిస్తుండటం విశేషం.