విద్యుత్, లోహ రంగం షేర్ల జోరుతో దేశీయ సూచీలు(stock market today) సోమవారం లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 478 పాయింట్లు లాభపడి 60,546 వద్ద ముగిసింది(sensex today live). ఎన్ఎస్ఈ నిఫ్టీ 152 పాయింట్లు వృద్ధి చెంది 18,069 వద్ద స్థిరపడింది(nifty 50 today live).
ఇంట్రాడే సాగిందిలా(stock market news today)...
ఉదయం 60,386 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్.. అంతర్జాతీయంగా నెలకొన్న మిశ్రమ పరిస్థితులతో నష్టాల్లోకి జారుకుంది. ఓ దశలో 59,779 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని తాకింది. తిరిగి పుంజుకుని 60,546 వద్ద సెషన్‌ను ముగించింది(stock market live news).
నిఫ్టీ 18,040 వద్ద ప్రారభమై.. 17,836 వద్ద కనిష్ఠాన్ని తాకింది. తిరిగి బలపడి 18,069కు చేరింది.
లాభనష్టాలు..
- అల్ట్రాటెక్, టైటాన్, బజాజ్ ఫిన్సర్వ్, టెక్ఎమ్, కొటాక్ బ్యాంకు, ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్ షేర్లు లాభాలు గడించాయి.
- ఇండస్ఇండ్ బ్యాంకు, దివీస్ ల్యాబ్, ఎం అండ్ ఎం, మారుతి, ఎస్బీఐ నష్టాలు చవిచూశాయి.
ఇదీ చూడండి:- Crypto Currency: టాప్ 10 క్రిప్టో కరెన్సీలు ఇవే..!