ETV Bharat / business

ఈ వారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలివే - ఈ వారం మార్కెట్​ ఆనాలసిస్​

అంతర్జాతీయ పరిణామాలు.. త్రైమాసిక ఫలితాలే ఈ వారం స్టాక్ మార్కెట్లను ముందుకు నడిపించనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. వీటికి తోడు ఆర్బీఐ నిర్ణయాలు, బడ్జెట్​ అంశాలు కూడా కీలకంగా మారనున్నట్లు తెలుస్తోంది.

Quarterly earnings to guide markets this week: Analysts
అంతర్జాతీయ పరిణామాలు, త్రైమాసిక ఫలితాలే కీలకం!
author img

By

Published : Feb 7, 2021, 11:48 AM IST

ఈ వారం స్టాక్ మార్కెట్లపై అంతర్జాతీయ పరిణామాలు, త్రైమాసిక ఫలితాల ప్రభావమే అధికంగా ఉండనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. మార్కెట్​ను ప్రభావితం చేసేంత పెద్ద వార్తలేమి లేకపోవడం వల్ల మదుపరులు తిరిగి ప్రాథమిక అంశాలపైనే దృష్టి పెట్టవచ్చని అభిప్రాయపడ్డారు.

గతవారం కేంద్ర బడ్జెట్​, ఆర్బీఐ ద్రవ్యపరపతి విధానం లాంటి రెండు ప్రధానాంశాలతో మార్కెట్​ సూచీలు జీవన కాల గరిష్ఠాలను నమోదు చేశాయి. ఈ క్రమంలో సెన్సెక్స్​ 51 వేల మార్క్​ను తాకింది. అయితే ఈ వారం మార్కెట్​ కొంత ఒడుదొడుకులకు లోనయ్యే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు చెప్తున్నారు.

"మార్కెట్​ను ప్రభావితం చేసే వార్తలు ఈ వారంలో లేవు. దీంతో ఆయా కంపెనీల త్రైమాసిక ఫలితాలు మార్కెట్​కు దన్నుగా నిలిచే అవకాశం ఉంది."

-వినోద్ నాయర్, రీసెర్చ్ హెడ్ (జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్)

ఈ వారంలో బీపీసీఎల్​, ఎన్​ఎమ్​డీసీ, ధనలక్ష్మీ బ్యాంక్​, టాటా స్టీల్​, బ్యాంక్ ఆఫ్​ బరోడా, గెయిల్​, హెచ్​సీఎల్​ ఇన్​ఫోసిస్టమ్స్​, అశోక్​ లేల్యాండ్​ల షేర్లు ప్రధానంగా లాభాలు ఆర్జించవచ్చని భావిస్తున్నారు.

పారిశ్రామిక ఉత్పత్తి, ద్రవ్యోల్బణ రేటుకు సంబంధించిన సమాచారాన్ని శుక్రవారం మార్కెట్​ ముగిసిన తరువాత ప్రకటిస్తారు. గత వారంలో బీఎస్​సీ రికార్డు స్థాయిలో 4,445.86 పాయింట్ల వృద్ధిని నమోదు చేసింది.

ఇదీ చూడండి: వారాంతంలోనూ బుల్​ జోరు- 50,700పైకి సెన్సెక్స్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.